పోస్టుమాన్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళన

పోస్టుమాన్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళన

నర్సాపూర్, వెలుగు: ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పోస్ట్ మాన్ పై చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామస్తులు ఆందోళన చేశారు. శుక్రవారం జీపీ ఆఫీస్ వద్దకు పోస్ట్​మాన్​వచ్చాడని తెలియడంతో గొల్లపల్లి, నారాయణపూర్ కు చెందిన మహిళలు వచ్చి  అతడితో గొడవపడ్డారు.

డబ్బులు ఇవ్వకుండా, సమయానికి విధులకు రాకుండా ఇబ్బంది పెడుతున్న పోస్ట్ మాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీని గురించి పోస్ట్ మాన్ చందును వివరణ కోరగా ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు గతంలో బయోమెట్రిక్ ద్వారా ఇచ్చేవారమని ప్రస్తుతం ఓచర్,రికార్డు రాయడం వల్ల జాప్యం జరుగుతోందన్నారు.