పల్సి గ్రామపంచాయతీని మండలంగా ప్రకటించాలి

కుభీర్, వెలుగు: కుభీర్​ మండలంలోని పల్సి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆ గ్రామస్తులు గురువారం ఎమ్మార్వో ఆఫీస్ మందు బైఠాయించి ధర్నా చేపట్టారు. అన్ని అనుకొలతలులు ఉన్నా తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని ఏండ్ల తరబడి కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తమ డిమాండ్​ను నెరవేర్చకపోతే నిరాహార దీక్షలతోపాటు ఎలక్షన్లను బైకాట్ చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు.