తూప్రాన్‌‌లో తల్వార్లతో వీరంగం

తూప్రాన్, వెలుగు : పతంగుల రేటు విషయంలో గొడవ జరగడంతో ఓ వర్గం వ్యక్తులు కత్తులు, తల్వార్లతో వీరంగం సృష్టించారు. ఈ ఘటన మెదక్‌‌ జిల్లా తూప్రాన్‌‌లో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తూప్రాన్‌‌లోని కేశవనగర్‌‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి పతంగులు అమ్ముతున్నాడు. వాటిని కొనేందుకు ఓ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రాగా.. రేటు విషయంలో వారికి, వ్యాపారికి మధ్య గొడవ జరిగింది.

దీంతో ఇద్దరు వ్యక్తులు తమ వర్గం వారికి సమాచారం ఇచ్చారు. 30 నుంచి 40 మంది వ్యక్తులు తల్వార్లు, ఇనుపరాడ్లను పట్టుకొని వచ్చి వ్యాపారి ఇంటిపై దాడి చేసి, పలువురిని గాయపరిచారు. తల్వార్లను చూపుతూ కాలనీలో హల్‌‌చల్‌‌ చేశారు. బాధితుల ఫిర్యాదుతో జగదీశ్‌‌, అమర్‌‌దీప్‌‌, రాంసింగ్‌‌పై కేసు నమోదు చేశామని, పూర్తి స్థాయిలో విచారణ చేశాక మిగతావారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.