పానీ పూరీ ఇలా తినాలి : కొరియన్ కు దగ్గరుండి నేర్పిస్తున్న ఇండియన్

సోదరులుగా చెప్పుకునే ఇద్దరు స్నేహితులు  జిన్ జంగ్ సోదరులు.  కొరియన్​ కు చెందిన జిన్ లిమ్ (రమేష్) మరియు ఇన్‌వూక్ జంగ్ (సురేష్), Instagramలో వైరల్​ అవుతున్నారు. నాగాలాండ్‌కు చెందిన స్నేహితుడితో పాటు, కొరియన్ వ్యక్తి కూడా పానీ పూరీతో ఆకట్టుకున్నారు. 

మామూలుగా స్ట్రీట్‌ ఫుడ్ విషయానికి వస్తే అందరూ మెచ్చేది పానీపూరినే. చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతిఒక్కరూ లొట్టలేసుకుంటూ తింటారు. అంతేకాకుండా ఏ వీధికి వెళ్లినా పానీపూరీ బండి మనకు దర్శనమిస్తుంటుంది. అయితే ఒక కొరియన్​ వ్యక్తి  కొత్తరకం పానీపూరీని తిని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతలా అతనేం చేశాడబ్బా అనుకుంటున్నారా...!

ప్రముఖ దేశీ స్నాక్ పానీ పూరీ అంటే అంద‌రూ ఇష్టంగా ఆర‌గిస్తారు. ఈ టేస్టీ స్నాక్‌ను రుచిచూసేందుకు కొరియ‌న్ వ్యక్తి వీధుల్లోకి (viral video) రావ‌డం ఆక‌ట్టుకుంది. కొరియ‌న్ యూట్యూబ‌ర్ ల‌డ్కా భార‌త్‌లో ఐదేండ్ల నుంచి నివ‌సిస్తున్నారు.నాగాలాండ్‌కు చెందిన స్నేహితుడితో పాటు, కొరియన్ వ్యక్తి కూడా పానీ పూరీని విచిత్రమైన రీతిలో తిని జనాలను  ఆకట్టుకున్నాడు. పానీపూరీ వంటకం ఎంత రుచికరమైనదో సూచించడానికి బొటనవేలు పైకి చూపించాడు. పానీ పూరీని ని తరచుగా తినేవారి ఇష్టమైన చాట్ వంటకంగా పిలుస్తారు. 

 భారతదేశంలో నివసిస్తున్న ఒక కొరియన్ వ్యక్తి తన భారతీయ స్నేహితుడితో కలిసి పానీ పూరీని తిన్నాడు. అయితే  ఈ వంటకాన్ని వారు దానిని వారి ఇంట్లోనే సిద్ధం చేసుకున్నారు. డిష్‌ని తయారు చేసి, కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు.  ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. 4 లక్షలకు పైగా వీక్షణలు ... సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో సుమారు 16 వేల మంది ఈ రీల్‌ను లైక్ చేసారు.

భార‌త్‌లో త‌న అనుభ‌వాల‌ను jinjung.brothers షార్ట్ వీడియోల ద్వారా ప్రపంచానికి చేర‌వేశారు. ఇన్‌స్టాగ్రాంలో  పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజ‌న్లను ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియోలో jinjung.brothers పానీ పూరీని టేస్ట్ చేయ‌డం క‌నిపిస్తుంది.ముందుగా పానీ పూరీని ఆర‌గించిన అత‌డు ఆపై టేస్ట్ బావుందంటూ మ‌రికొన్ని తిన‌డం చూడొచ్చు. మీకు ఇష్టమైన దేశీయ స్ట్రీట్ ఫుడ్ గురించి కామెంట్స్ సెక్షన్‌లో త‌న‌కు తెలియ‌చేస్తే మ‌రోసారి తాను వాటిని ప్రయ‌త్నిస్తాన‌ని పోస్ట్‌లో  రాసుకొచ్చారు.