హీలియం బెలూన్ చాలెంజ్‌లో కోహ్లీ
హైదరాబాద్: నేను క్రికెటర్‌ని.. మనీ హైస్ట్ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చెయ్యలే.. నాకు ప్రైవేట్ జెట్ లేదు.. పంజాబీ వచ్చు.. ఇంటర్నెట్‌లో తన గురించి ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలకు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇచ్చిన సమాధానాలివి. ఏదో రెగ్యులర్ ఇంటర్వ్యూలో విరాట్‌ఇవి చెబితే ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏముంది. ఇటీవల ట్రెండింగ్‌గా మారిన హీలియం బెలూన్ చాలెంజ్‌లో ఈ సమాధానాలు చెప్పిన కోహ్లీ.. వెరైటీ వాయిస్‌తో ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చాడు. బెలూన్‌లో నింపిన హీలియం గ్యాస్‌ను ఎవరైనా పీలిస్తే ఆ వ్యక్తి గొంతు కాసేపు వెరైటీగా మారుతుంది. ఈ చాలెంజ్‌ను స్వీకరించిన కోహ్లీ.. తన గురించి ఫ్యాన్స్ చేసిన సెర్చ్‌లకు ఆ వెరైటీ గొంతుతో బదులిచ్చాడు.
On a lighter note?
— Virat Kohli (@imVkohli) December 22, 2021
Helium Balloon Voice#ad pic.twitter.com/144estOGM5