ODI World Cup 2023: శ్రీలంక దిగ్గజాన్ని వెనక్కి నెట్టిన కోహ్లీ.. ఇక మిగిలింది ముగ్గురే

టీమిండియా రన్ మెషీన్ తన పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నాడు. అస్సలు తగ్గేదే లేదంటూ వరల్డ్ కప్ లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా బౌలర్లకు దడ పుట్టిస్థూ సరికొత్త రికార్డులు సెట్ చేస్తున్నాడు. ఆడిన ఐదు మ్యాచుల్లో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు బాదేశాడు. తాజాగా నిన్న న్యూజిలాండ్ మీద జరిగిన మ్యాచులో 95 పరుగులు చేసి భారత్ కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. 

కోహ్లీ ఈ ఇన్నింగ్స్ ద్వారా  వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన లిస్టులో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంక దిగ్గజం సనత్ జయసూరియా 13430 పరుగుల రికార్డును విరాట్ అధిగమించాడు. ఓవరాల్ గా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (18426), శ్రీలంక వికెట్ కీపర్ బ్యాటర్  కుమార సంగక్కర (14234), ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ (13704) తొలి మూడు స్థానాల్లో నిలిచి కోహ్లీ కంటే ముందున్నారు. 

ALSO READ : బైంసాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. 500 మంది రాజీనామా

కోహ్లీ ఫామ్ చూస్తుంటే మరో ఏడాది పాటు ఆడినా ఈజీగా పాంటింగ్, సంగక్కర లను వెనక్కి నెట్టేయడం ఖాయం. అదే జరిగితే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన తొలి రెండు జాబితాలో మన క్రికెటర్లే ఉంటారు. ప్రస్తుతం వన్డేల్లో అత్యధిక సెంచరీలతో సచిన్, కోహ్లీ, రోహిత్ తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి వన్డేల్లో కోహ్లీ తన ఆటతో మరిన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)