సెంచరీ చేసి ఐదేళ్లు అవుతుంది..కోహ్లీ కాకా ఈసారైనా కొట్టు జర..

సెంచరీ చేసి ఐదేళ్లు అవుతుంది..కోహ్లీ కాకా ఈసారైనా కొట్టు జర..

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసి ఐదేళ్లు అవుతుంది. అదేంటి టీ20 వరల్డ్ కప్లో చేశాడు కదా..మళ్లీ బంగ్లాదేశ్పై కూడా చేశాడు కదా అనుకుంటున్నారా..అవును టీ20 వరల్డ్ కప్తో పాటు..బంగ్లాపై, ఐపీఎల్లోనూ కోహ్లీ సెంచరీలు బాదాడు. కానీ టెస్టుల్లో విదేశాల్లో సెంచరీ చేసి ఐదేళ్లు అవుతుంది. 

చివరగా ఎప్పుడంటే..

విరాట్ కోహ్లీ చివరి సారిగా 2018లో  టెస్టుల్లో విదేశాల్లో సెంచరీ చేశాడు. ఆ ఏడాది  డిసెంబరులో పెర్త్‌లో ఆస్ట్రేలియాపై శతకం బాదాడు. ఆ తర్వాత విదేశాల్లో ఇతర జట్లతో టెస్టులు ఆడినా ..కోహ్లీ మాత్రం సెంచరీ చేయలేకపోయాడు. ఈ క్రమంలో జులై 12వ తేదీ నుంచి విండీస్తో జరిగే టెస్టు సిరీస్లో కోహ్లీ ఆడబోతున్నాడు.  ఈ సిరీసులో కచ్చితంగా కోహ్లీ సెంచరీ కొట్టేస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

రికార్డు గొప్పగా లేదు మరీ..

విండీస్ గడ్డపై కోహ్లీ రికార్డు అంత గొప్పగా లేదు.  టెస్టుల్లో తన తొలి డబుల్ సెంచరీని విండీస్ గడ్డపైనే కోహ్లీ బాదాడు. కానీ ఆ తర్వాత పెద్దగా రాణించలేదు. ఇతర అన్ని జట్లపై మంచి రికార్డు  ఉన్న కోహ్లీకి..వెస్టిండీస్, ఇంగ్లండ్ గడ్డపై గణాంకాలు అంత గొప్పగా లేవు. అయితే ఇటీవల ఫాంలోకి వచ్చిన కోహ్లీ...ఐపీఎల్ లో వరుస సెంచరీలతో రెచ్చిపోయాడు. అయితే WTC ఫైనల్లో ఆశించినంత రాణించలేకపోయాడు.  ఈ క్రమంలో విండీస్ సిరీస్ లో కోహ్లీ రాణిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

ఎన్ని మ్యాచులు ఆడాడంటే..

విరాట్  కోహ్లీ ఇప్పటి వరకు  కరీబియన్ దీవుల్లో 13 టెస్టులు ఆడాడు.  35.61 సగటుతో 463 పరుగులు చేశాడు. ఇందులో హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది.