కేవీ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్ హీరోగా ఫంకీ సినిమా

ఇటీవల ‘మెకానిక్ రాకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విశ్వక్ సేన్.. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు.  తను హీరోగా మరో సినిమా మొదలైంది.  ‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.  పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌‌‌గా రూపొందనున్న ఈ మూవీకి ‘ఫంకీ’ అనే టైటిల్‌‌ను ఖరారు చేశారు. 

బుధవారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.  ముహూర్తపు షాట్‌‌కు దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు కళ్యాణ్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత నాగవంశీ స్క్రిప్ట్‌‌ను మూవీ టీమ్‌‌కు అందజేశారు. ఈ  సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంది. భీమ్స్ సిసిరోలియో దీనికి సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభించబోతున్నారు.