భారీ మెజారిటీతో వివేక్ బ్రదర్స్ విక్టరీ..

తెలంగాణలో హస్తం హవా కొనసాగుతోంది.  మెజారిటీ సీట్లలో ఆధిక్యంలో ఉంది.  సింగిల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది.  ఇక చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి భారీ విజయం సాధించారు. ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పై 37,189 మెజారిటీతో  గెలిచారు. బెల్లంపల్లిలో గడ్డం వినోద్ కూడా భారీ మెజారిటీతో  విజయం సాధించారు. 

మరో వైపు కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ దాటడంతో కార్యకర్తలు,నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.  ఇప్పటికే రేవంత్ ను డీజీపీ అంజనీకుమార్ కలిసారు. రేవంత్ భారీ ర్యాలీగా గాంధీ భవన్ కు వెళ్లారు.