రాష్ట్రంలో ఎస్సీలకు 18% రిజర్వేషన్లు కల్పించండి : వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో ఎస్సీలకు  18% రిజర్వేషన్లు కల్పించండి : వివేక్ వెంకటస్వామి
  • ఖర్గేకు వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట బడ్జెట్‌లో ఎస్సీలకు 18 శాతం ఫండ్స్ కేటాయించేలా చొరవ చూపాలని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో పలువురు ఎస్సీ నేతలతో కలిసి ఖర్గేకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇచ్చిన మేరకు చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని ఖర్గేను వివేక్, వంశీకృష్ణ  కోరారు. రాష్ట్రంలో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.