
గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బర్త్‌డే వేడుకలు గురువారం గోదావరిఖనిలోని అమ్మపరివార్ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాళ్లూరి పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఐఎన్‌టీయూసీ ఉమ్మడి రాష్ట్రాల ఉపాధ్యక్షుడు గుమ్మడి కుమారస్వామి హాజరయ్యారు.
అనాథ పిల్లల నడుమ కేక్ కట్ చేసి వారికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామి తన ట్రస్టు ద్వారా అనేక పాఠశాలల్లో, ఆశ్రమాల్లో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం ఆశ్రమంలో అన్నదానం చేశారు.