కరీంనగర్ జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. జిల్లా కేంద్రంలోని వేర్వేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురిని పరామర్శించారు. ఆరోగ్యంపై ఆరా తీసి వారికి ధైర్యం చెప్పారు..
ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా వెలగటూరు మండలం కుమ్మరిపల్లికి చెందిన జక్కుల అజయ్, కిషన్ రావుకు చెందిన శ్రీను అనే ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మరో వ్యక్తి ఎండపల్లి మండలం రాజారాం పల్లికి చెందిన భూసారపు కిష్టయ్య చెట్టుపై నుండి పడి గాయపడగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.