డ్రైవర్‍ని అప్రమత్తం చేసే ఫీచర్ డేంజర్ జోన్ వస్తే యాక్సిడెంట్ అలర్ట్

డ్రైవర్‍ని అప్రమత్తం చేసే ఫీచర్  డేంజర్ జోన్ వస్తే యాక్సిడెంట్ అలర్ట్

మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా రోడ్డు ప్రమాదాలు పొంచి ఉంటాయి. రోడ్ యాక్సిడెంట్ లో ఓ ప్రాణం పోతే ఓ కుటుంబం రోడ్డుపై పడ్డట్టే. అయితే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా మూల మలుపులు, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానో జరుగుతుంటాయి. వోల్వో కార్స్ కంపెనీ ఈ కారణాల వల్ల జరిగే ప్రమాదాలకు చెక్ పెట్టాలనుకుంది. దీనికోసం వోల్వో కార్లలో యాక్సిడెంట్ ఎహెడ్ అలెర్ట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టినట్లు ఫిబ్రవరి 29న ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సిస్టమ్ లో  కారు ప్రయాణిస్తున్న మార్గంలో యాక్సిడెంట్ జోన్స్, ప్రమాదకర టర్నింగ్స్ వచ్చినప్పుడు డ్రైవర్ ను అప్రమత్తం చేస్తోంది.

కారు యాక్సిడెంట్ అయే అవకాశం ఉంటే వెంటనే అలర్ట్ సిస్టమ్ డ్రైవర్ ముందున్న డ్యాష్ బోర్డు నుంచి లైట్ వచ్చి, అలర్ట్ చేస్తుంది. ప్రమాదకర టర్నింగ్ ఉన్నా హై అలర్ట్ చేస్తుంది. మీ కారు సమీపంలో ఏదైనా కారు దగ్గరగా వచ్చినా, లైన్ క్రాష్ అయినా ఈ అలారం మోగుతుంది. ఈ ఫీచర్ మొదట్లో డెన్మార్క్‌లో ప్రస్తుతం ఉన్న 40, 60 , 90 సిరీస్‌ల వోల్వో మోడళ్లలో అందుబాటులోకి వస్తుంది. ఈ ఏడాది చివర్లో ఇతర యూరోపియన్ దేశాల్లో దీన్ని విడుదల చేయాలని కంపెనీ ప్రయత్నిస్తుంది. ఇండియాలోకి ఎప్పుడ విడుదల చేస్తోందో ఇంకా ప్రకటించలేదు.