అక్షయ పాత్ర కు 9 ఫుడ్​ డెలివరీ వెహికల్స్

అక్షయ పాత్ర కు 9 ఫుడ్​ డెలివరీ వెహికల్స్
  • డొనేట్​ చేసిన వాఘ్​బక్రీ ఫౌండేషన్ 

వాఘ్​బక్రీ ఫౌండేషన్ ప్రత్యేకంగా తయారు చేయించిన తొమ్మిది ఫుడ్​డెలివరీ వెహికల్స్ ను అక్షయ పాత్ర ఫౌండేషన్​కు విరాళంగా అందజేసింది. వీటితో హైదరాబాద్, నెల్లూరు ప్రాంతాల్లో 205కి పైగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్​వాడీల్లోని 10,500 మంది స్టూడెంట్లకు భోజనాన్ని అందించే ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రాంతీయ అధ్యక్షుడు సత్య గౌర చంద్రదాస్​మాట్లాడుతూ అక్షయ పాత్ర ఫౌండేషన్​తెలంగాణలో రోజుకు 1,76,073, ఏపీలో 1,44,732 మంది స్టూడెంట్లకు భోజనాలు అందిస్తోందని, వాఘ్​బక్రీ ఫౌండేషన్​ అందిస్తున్న నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. వాఘ్​బక్రీ టీ గ్రూప్​సీఈఓ సంజయ్​సింగల్​ మాట్లాడుతూ అక్షయపాత్ర ఫౌండేషన్​భాగస్వామ్యంతో వేలాది మంది విద్యార్థులకు సేవ చేసే అవకాశం కలిగిందన్నారు.