సోలిపూర్ ను మండలం చేస్తాం

ఖిల్లాగణపురం, వెలుగు: మండలంలోని మేజర్  గ్రామపంచాయతీ సోలీపూర్​ను మండల కేంద్రంగా చేసేందుకు తనవంతు కృషి చేస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శుక్రవారం సోలీపూర్​లో హైస్కూల్  కాంపౌండ్  వాల్, తెలుగువాడలో రూ. 5 లక్షలతో సీసీ రోడ్  నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంపై కాంగ్రెస్  ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని, నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేగా తనకు కేటాయించిన నిధులను విద్యాభివృద్ధికి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

క్రీడలను బలోపేతం చేయడానికి రాష్ట్రంలో నాలుగు స్పోర్ట్స్​ స్కూల్స్​ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పెద్దమందడి మండలంలోని వెల్టూర్, జంగమయ్యపల్లి-, బలిజపల్లి గ్రామాలను మండల కేంద్రాలుగా చేస్తున్నామని తెలిపారు. అనంతరం మల్కాపురం గ్రామానికి కేఎల్ఐ డి8 కాలువ ద్వారా కృష్ణా జలాలు చేరుకోవడంతో ఎమ్మెల్యే పూజలు చేశారు. మండలంలోని ముందరి తండా, మల్కుమియాన్ పల్లి గ్రామాల్లో గ్రామపంచాయతీ బిల్డింగ్​లకు శంకుస్థాపనలు చేశారు. మాజీ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటయ్య, వెంకట్రావు, సాయిచరణ్ రెడ్డి, సతీశ్  పాల్గొన్నారు.