సిటీస్ 2.0 స్టేట్ లెవల్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్

సిటీస్ 2.0 స్టేట్ లెవల్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: రాజస్థాన్ రాష్ట్రం జైపూర్​లో కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12వ రీజనల్ 3ఆర్​అండ్ సర్కులర్ ఎకానమీ ఫోరం ఇన్ ఏషియా అండ్ ది పసిఫిక్ జాతీయ సదస్సులో సిటీ 2.0స్టేట్​లెవల్ క్లైమేట్​యాక్షన్​ప్లాన్ ఏర్పాటుకు వరంగల్​ సిటీతో అగ్రిమెంట్ చేసినట్లు బల్దియా మేయర్ గుండు సుధారాణి, కమిషనర్​ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. ఈ సందర్భంగా మేయర్​మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, సీఎం రేవంత్​రెడ్డి వ్యర్థాల సమర్ధ నిర్వహణకు ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. 

హుజురాబాద్ సమీపంలోని సిర్సాపల్లి వద్ద వ్యర్థాల నుంచి పవర్ ఉత్పత్తికి యూనిట్లు ఏర్పాటు చేయనున్నారని, రాష్ట్ర స్థాయి క్లైమేట్ యాక్షన్ ప్లాన్ ఏర్పాటులో భాగంగా మున్సిపాలిటీలో క్లైమేట్ సెంటర్ల ఏర్పాటు చేసి అధికారులు సిబ్బందికి సామర్థ్యాన్ని పెంచేలా శిక్షణనను అందజేసి, వరదలు రాకుండా క్లైమేట్ ప్లాన్ ను తయారు చేయనున్నట్లు వివరించారు. అలాగే సిటీస్ 2.0 స్టేట్ లెవల్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో గత సెప్టెంబర్ లో అందుకు సంబంధించిన సమాచారాన్ని అందజేశామని, ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రం ఎంపికైన నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ ఎఫైర్స్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అగ్రిమెంట్ జరిగినట్లు తెలిపారు.