
నర్సంపేట, వెలుగు : రైలు కింద పడి ఓ స్టూడెంట్సూసైడ్ చేసుకోగా.. కాలేజ్యజమాన్యం, ఇన్విజిలేటరే కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబసభ్యులు డెడ్‌బాడీతో ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. వరంగల్జిల్లా ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన భూక్య సాయికుమార్(22) నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. సెకండియర్‌లో ఫెయిల్‌కావడంతో బాలాజీ మహిళా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్‌లో సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నాడు. బుధవారం కాపీయింగ్చేస్తుండగా ఓ ఇన్విజిలేటర్ కొట్టాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
కలత చెందిన సాయికుమార్ గురువారం సాయంత్రం గీసుగొండ మండలం వంచనగిరి సమీపంలో గూడ్స్ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు వరంగల్ ఎంజీఎంకు వెళ్లి డెడ్‌బాడీకి పోస్టుమార్టం చేయించాక నర్సంపేటకు తీసుకొచ్చారు. నేరుగా బాలాజీ కాలేజ్గేట్ఎదుట డెడ్‌బాడీ పెట్టి ధర్నాకు దిగారు. కాలేజీ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో కమీషనరేట్పరిధిలోని పలు పోలీస్స్టేషన్ల నుంచి బలగాలను రప్పించి మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు..మృతుడి కుటుంబ సభ్యులను, కాలేజీయాజమాన్యాన్ని కలిసి మాట్లాడుకోవాలని చెప్పారు. చివరికి రూ.30 వేల పరిహారం ఇవ్వడంతో ఆందోళన విరమించి వెళ్లిపోయారు.