జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలి

జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలి

గ్రేటర్​ వరంగల్​, వెలుగు: ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న డబుల్​ బెడ్ రూమ్స్​ ఇండ్లను కేటాయించాలని ఆదివారం వరంగల్​ఏసీపీ నందిరామ్ నాయక్​కు వరంగల్​ తూర్పు జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలతో పాటు నిరాహార దీక్షలు చేపడుతున్న క్రమంలో పర్మిషన్​ కోసం వరంగల్ ఏసీపీకి వినతిపత్రం అందజేశామన్నారు. కార్యక్రమంలో తూర్పు జర్నలిస్టులు పాల్గొన్నారు.