గ్రాడ్యుయేట్ బైపోల్ కౌంటింగ్.. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు షురూ

గ్రాడ్యుయేట్ బైపోల్ కౌంటింగ్.. తొలి ప్రాధాన్యత  ఓట్ల లెక్కింపు షురూ

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్  కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని ప్రభుత్వ గౌడన్స్ లో కౌంటింగ్ జరుగుతోంది. నాలుగు హాల్స్ లలో 96 టేబుల్స్ పై  కౌంటింగ్ జరుగుతోంది. ఒక్కో టేబుల్ పై 1000 ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ప్రారంభించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే  అర్థరాత్రి  అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు  కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాని పోటీ ఉంది.  బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎన్నికలు జరగడంతో ఓట్ల లెక్కింపు ఆలస్యం కానుంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మే 27న మూడు ఉమ్మడి జిల్లాల్లోని 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 3 లక్షల 36 వేల13 ఓట్లు పోలయ్యాయి. ఈ ఉప ఎన్నికలో  మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ ల మధ్యే తీవ్ర పోటీ ఉంది.