వరంగల్ సీపీకి ఘనంగా వీడ్కోలు

వరంగల్ సీపీకి ఘనంగా వీడ్కోలు

హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనర్​గా పని చేసి, బదిలీపై రామగుండం కమిషనరేట్ కు వెళ్తున్న అంబర్ కిశోర్ ఝాకు పోలీస్ అధికారులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. పూలతో అలంకరించిన పోలీస్ వాహనంలో ఆయనను ఎక్కించి, డీసీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు అంతా తాడుతో లాగుతూ గౌరవంగా సెండాఫ్ ఇచ్చారు. డీసీపీలు షేక్​ సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్​ కుమార్, ఏఎస్పీ చైతన్య, అడిషనల్​డీసీపీలు రవి, సురేశ్​కుమార్, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొని ఆయనకు వీడ్కోలు పలికారు. 

అంతకుముందు కమిషనరేట్ ఆఫీస్ లో సీపీ అంబర్​ కిశోర్ ఝాతోపాటు సీఐడీ ఎస్పీగా బదిలీ అయిన ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్​ను పోలీస్​ ఆఫీసర్లు సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ వరంగల్‌ పోలీస్‌ ఎవర్‌ విక్టోరియస్‌ అన్నారు. వరంగల్ జిల్లాతో ఆరు సంవత్సరాల అనుబంధం ఉందని, ఇక్కడ పని చేయడం సంతృప్తినిచ్చిందన్నారు. డీసీపీ రవీందర్‌ మాట్లాడుతూ ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా పని చేయడం సంతృప్తి కలిగించిందని, ఇక్కడి ఆఫీసర్లు, సిబ్బంది సమన్వయం బాగుందన్నారు.