వరంగల్లో మావోయిస్టుల లేఖ..బీఆర్ఎస్ నేతలకు హెచ్చరిక

వరంగల్ జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది.  ప్రేమికుంట చెరువు కబ్జాపై మావోలు లేఖలు విడుదల చేశారు. బీఆర్ఎస్ లీడర్లే టార్గెట్ గా లేఖలో హెచ్చరికలు జారీ చేశారు. 

తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారిపోయారని విమర్శించారు. హసన్ పర్తి, ధర్మసాగర్ మండలాల్లో భూ ఆక్రమణలు పెరిగిపోయాయని అన్నారు. చెరువు కోసం స్థానికులు, గ్రామస్తులు ఎంత పోరాటం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిర్లక్ష్యం చేసిన అధికారులు, మోసాలకు పాల్పడుతున్న బీఆర్ఎస్ నేతలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. జీఎండబ్ల్యూపీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్  పేరిట లేఖలు వెలిశాయి.