పర్వతగిరి/ వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గురువారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపెల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో నందనం రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో, వర్ధన్నపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో, ఐకేపీ ఆధ్వర్యంలో దమ్మనపేట ఇల్లందలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రాష్ట్ర టెస్కాబ్ చైర్మన్ మార్నెని రవీందర్ రావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం సన్న వడ్లకు మార్కెట్ ధరతో పాటు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా డయల్ యువర్ ఎమ్మెల్యే 80961 07107 ను సంప్రదించాలని సూచించారు. చౌపటపల్లి కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ నీరజ, తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీవో శంకర్‌నాయక్, ఎంపీవో శ్రీనివాస్, ఏపీఎం కృష్ణమూర్తి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్‌రావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యం..
వర్ధన్నపేట : మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. గురువారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పరిధిలోని దమ్మన్నపేట పెద్ద చెరువులో ముదిరాజ్ కులస్తులు, గ్రామలు, కాంగ్రెస్ నాయకులు, అధికారులతో కలిసి ఆయన చేప పిల్లలను వదిలారు. కార్యక్రమంలో వరంగల్అడిషన్కలెక్టర్ సంధ్యారాణి, టేస్క్యాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఎంపీడీవో వెంకటరమణ, ఎంపీవో ధనలక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి పాల్గొన్నారు.