వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా ప్రస్తుతం న్యూజీలాండ్ మీద మ్యాచ్ ఆడుతుంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అయితే ఈ ఆనందం న్యూజీలాండ్ కు ఎంతో సేపు నిలవలేదు. ఆసీస్ ఓపెనర్లు శివాలెత్తడంతో కివీస్ బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. తొలి 10 ఓవర్లలోనే బౌండరీల వర్షం కురిపిస్తూ విధ్వంసం సృష్టించారు.
ఈ మ్యాచ్ లో ఆసీస్ ఒక మార్పు చేసింది. గాయం నుంచి కోలుకున్న హెడ్ ను తుది జట్టులోకి తీసుకొచ్చింది. అయితే వరల్డ్ కప్ లో ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే హెడ్ కివీస్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. తొలి ఓవర్ నుంచే ఎటాకింగ్ చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరోవైపు డేవిడ్ వార్నర్ ఏ మాత్రం తగ్గకుండా మరో ఎండ్ లో బౌండరీల వర్షం కురిపించాడు.
Also Read :- కోహ్లీ ఇలాంటి ఆహారం తింటాడా..?
దీంతో తొలి 10 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోర్ 118 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు చేశారు. 37 బంతుల్లో వార్నర్ 65 పరుగులు చేస్తే.. హెడ్ 25 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి ధాటికి తొలి 10 ఓవర్లలో 10 సిక్సులు, 11 ఫోర్లు వచ్చి చేరాయి. హెన్రీ వేసిన మూడో ఓవర్లో 22 పరుగులు, లాకీ ఫెర్గుసన్ వేసిన 7 ఓవర్లో 19 పరుగులు వచ్చాయి.
Dynamic duo! ? Warner and Head stitch together a majestic 150-run partnership, setting the stage on fire. Australian openers making it look easy!
— Cricket on STARZPLAY (@starzplaymasala) October 28, 2023
Watch live on CricLife Max via STARZPLAY: https://t.co/PVzZuyWHDi#WorldCup2023 #AUSvsNZ pic.twitter.com/ujhYvikuRw