దండేపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కు వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు రూ.4 లక్షల విలువైన మెడికల్ ఎక్విప్మెంట్స్ అందించారు. ఈసీజీ మెషీన్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, ఇన్వెర్టర్, కంప్యూటర్, కుర్చీలు, టేబుల్, రిఫ్రిజిరేటర్ తదితర వస్తువులను సోమవారం దండేపల్లి హెల్త్ అండ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం.సతీశ్ కుమార్కు అందజేశారు.
వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్, మీహూహ ఫౌండేషన్, గివ్ ది నీడ్, హోప్స్ అండ్ స్మైల్ సభ్యులు, సన్ షైన్ ఎండీ డాక్టర్ గురువారెడ్డి, డాక్టర్ దివాకర్ రెడ్డికి రెబ్బనపల్లి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో నవజ్యోతి అసోసియేషన్ సభ్యులు డాక్టర్ రాజేంద్రప్రసాద్, నాయకులు కందుల అశోక్, బండ రాకేశ్, చుంచు మల్లేశ్, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు