Cricket World Cup 2023: విమర్శించే హక్కు ఎవరికీ లేదు: కోహ్లీపై పాక్ దిగ్గజ బౌలర్ ప్రశంసలు..

Cricket World Cup 2023: విమర్శించే హక్కు ఎవరికీ లేదు: కోహ్లీపై పాక్ దిగ్గజ బౌలర్ ప్రశంసలు..

వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే మన జట్టు ముందే ఊహించినా.. కోహ్లీ సెంచరీ మాత్రం అనూహ్యంగా వచ్చింది. విజయానికి 26 పరుగులు కావాల్సిన దశలో కోహ్లీ కూడా 74 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ దశలో తన వద్దే స్ట్రైక్ ఉంచుకొని పరుగులన్నీ చేసి సెంచరీతో పాటు మ్యాచును ఫినిష్ చేసాడు. ఈ క్రమంలో సింగిల్ వచ్చే అవకాశమున్నా కోహ్లీ తిరగకపోవడంతో కొంతమంది నెట్ రన్ రేట్ కోసం ఆలోచించకుండా సెంచరీ కోసం కోహ్లీ ఆడాడని విమర్శించారు. ఈ విషయంపై పాక్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ కోహ్లీ గురించి గొప్పగా మాట్లాడాడు. 

కోహ్లి ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు అద్భుతమని.. అతను కేవలం బౌండరీల ద్వారా మాత్రమే కాదు వికెట్ల మధ్య చాలా వేగంగా పరిగెత్తిన సంగతి గుర్తుంచుకోవాలని తెలియజేశాడు. సెంచరీ కోసం కోహ్లీ ఎక్కువ బంతులేమీ ఆడలేదని అలాంటప్పుడు అతన్ని విమర్శించడంలో అర్ధం లేదని అక్రమ్ చెప్పుకొచ్చాడు. అంతక ముందు ఇన్నింగ్స్ ఆసాంతం ఫీల్డింగ్ చేసిన కోహ్లీ..13 ఓవర్ లో బ్యాటింగ్ కి దిగి మ్యాచును గెలిపించిన కోహ్లీని విమర్శించే హక్కు లేదని అక్రమ్ పేర్కొన్నాడు.  

Also Read : Crickek World Cup 2023: కోహ్లీ తప్పేం లేదు.. అసలు నిజాన్ని చెప్పిన రాహుల్

         
ఇక ఈ మ్యాచు లో విరాట్‌ కోహ్లి సింగిల్‌ తీసేందుకు ప్రయత్నిస్తే తానే వద్దని చెప్పానని కె.ఎల్‌ రాహుల్‌ మ్యాచ్‌ అనంతరం తెలిపాడు. కానీ సింగిల్స్‌ తీయకుంటే బాగుండదని... వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతున్నానని జనాలు భావిస్తారని కోహ్లీ తనతో చెప్పాడని రాహుల్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.