వాతావరణ శాఖ హెచ్చరిక: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

వాతావరణ శాఖ హెచ్చరిక:  తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

తెలుగురాష్ట్రాల్లో మూడు రోజులపాటు ( అక్టోబర్​ 5,6,7 తేదీలు) వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  దక్షిణ  బంగాళాఖాతం మీదుగా  ఎగువ వాయు తుఫాన్​  విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది.   ప్రస్తుతం ఏపీ తీరంలో 1.5 కి.మీ. నుంచి 4.54.5 కి.మీ మధ్య సముద్ర మట్టానికి ఎత్తులో నైరుతి వైపుగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

హైదరాబాద్ సిటీలో చూస్తే ఆకాశం మేఘావృతమై ఉంటుందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. 

 తెలంగాణలో   నిజామాబాజ్, సిరిసిల్ల, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

అక్టోబర్​ 6 ఆదివారం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.