వారఫలాలు ( సౌరమానం) సెప్టెంబర్ 15 నుంచి 21 వరకు

వారఫలాలు ( సౌరమానం) సెప్టెంబర్ 15 నుంచి 21 వరకు

మేషం : ఆదాయం సంతృప్తికరం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి విషయాల్లో కొత్త  అగ్రిమెంట్లు.  గృహం, వాహనాలు సమకూర్చుకుంటారు. తండ్రి తరఫు వారితో సఖ్యత. అనుకున్న కార్యక్రమాల్లో పురోగతి. వ్యాపారులు కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు. విధి నిర్వహణలో ఉద్యోగులు అవాంతరాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు. పరిశోధకులు,  కళాకారులకు ఊహించని అవకాశాలు. పారిశ్రామికవేత్తలు కొత్త విభాగాలు ప్రారంభిస్తారు.

వృషభం : ఇంటాబయటా గౌరవమర్యాదలు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. నిరుద్యోగులకు అనుకోని ఉద్యోగలాభం. ఇంటి నిర్మాణయత్నాల్లో పురోగతి. దీర్ఘకాలిక వివాదాల పరిష్కారం. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. వ్యాపారులకు కొత్త  పెట్టుబడులు. ఉద్యోగులకు ఉత్సాహం. పారిశ్రామికవేత్తలకు అనుకోని ఆహ్వానాలు. క్రీడాకారులకు విశేషంగా కలసివస్తుంది. కళాకారులకు పట్టుదలతో అవకాశాలు.

మిథునం : దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి. కొత్త కార్యాలు చేపడతారు. ఉద్యోగార్థులకు అనుకున్న ఉద్యోగాలు. అంచనాలు నిజమవుతాయి. కుటుంబంలో మీ మాటకు ఎదురుండదు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. సోదరులు,సోదరీలతో విభేదాల పరిష్కారం. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. క్రీడాకారులు, కళాకారులకు అవకాశాలు వస్తాయి.

కర్కాటకం : ముఖ్య కార్యాలు విజయవంతం. ఆదాయం ఆశాజనకం. ముఖ్య నిర్ణయాల్లో కుటుంబసభ్యుల సూచనలు పాటిస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు తీరతాయి. శత్రువులు కూడా మీపట్ల ప్రేమ చూపుతారు. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరం. పారిశ్రామికవేత్తలు కొత్త సంస్థల ఏర్పాటుపై తుది ఒప్పందాలు. రాజకీయవేత్తలు అంచనాలు నిజం చేసుకుంటారు. పరిశోధకులు, కళాకారులకు సన్మానాలు.

సింహం : నూతన విషయాలు గ్రహిస్తారు. వ్యతిరేకులు అనుకూలంగా మారతారు. బంధువుల నుంచి ధనలబ్ధి. అందరిలోనూ విశేష గుర్తింపు. చేపట్టిన కార్యాల్లో పురోగతి. వివాహాది శుభకార్యాల్లో చురుగ్గా  పాల్గొంటారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. నిరుద్యోగులకు అనుకూల సమాచారం. జీవితభాగస్వామితో సఖ్యత. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామికవర్గాలకు విజయాలు. క్రీడాకా రులు, కళాకారులు అనుకున్నది సాధిస్తారు.

కన్య : కొన్ని కార్యాలు విజయవంతంగా పూర్తి. ఆశించిన రాబడి. ఒక సమాచారం నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. శత్రువులు స్నేహితులుగా మారతారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగుల విధి నిర్వహణ ప్రశాంతం. క్రీడాకారులకు అవార్డులు రావచ్చు. రాజకీయవర్గాలకు నూతన పదవీయోగం. పారిశ్రామికవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు.

తుల : కొన్ని కార్యాలు. నిదానంగా సాగుతాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాల్లో అవాంతరాలు తొలగుతాయి.  వ్యాపారులకు ఊహించని రీతిలో పెట్టుబడులు, లాభాలు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. క్రీడాకారులు నైపుణ్యత చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలకు నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. రాజకీయవేత్తలకు ఉత్సాహం, విదేశీ పర్యటనలు. పరిశోధకులు, కళాకారులకు కొత్త అవకాశాలు.

వృశ్చికం : నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. శత్రువులు స్నేహితులుగా మారి మీ అభివృద్ధికి సహకరిస్తారు. ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగులకు అనుకోని ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవేత్తలకు విదేశీ ఆహ్వానాలు. కొత్త సంస్థల ఏర్పాటులో విజయం. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

ధనస్సు : చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. సోదరుల నుంచి ధన, వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. పట్టుదల, నేర్పుతో కొన్ని సమస్యల పరిష్కారం. అదనపు రాబడితో ఉత్సాహం. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు. వ్యాపారులకు లాభాలు. పారిశ్రామికవేత్తలకు వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు. కళాకారులు, పరిశోధకులు సత్తా చాటుకుంటారు.

మకరం :ఆదాయవ్యయాల మధ్య పొంతన ఉండదు.. ఒక సమాచారం నిరుద్యోగులను గందరగోళంలో పడేస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. పెట్టుబడులు కొంత ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు పదవుల కోసం చేసే యత్నాలు మందగిస్తాయి. పారిశ్రామికవేత్తలకు నిదానం అవసరం. వారం మధ్యలో  శుభవార్తా శ్రవణం. వాహనసౌఖ్యం. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

కుంభం : దూరప్రయాణాలు. రాబడి కాస్త మెరుగ్గా ఉంటుంది.  కోర్టు కేసులు ఇబ్బంది కలిగించినా ఉపశమనం లభిస్తుంది. సోదరీలను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. శుభకార్యాలకు విరివిగా డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన లాభాలు. ఉద్యోగులకు ఆశ్చర్యకరమైన రీతిలో  ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు కొన్ని విజయాలు. రాజకీయవేత్తలకు పదవులు రాగలవు. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి.

మీనం : కుటుంబసమస్యలు కొన్ని  తీరతాయి. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. ఒక కీలక సమాచారం అందుకుంటారు. బంధు వర్గంతో ఆనందంగా గడుపుతారు. ఇంటి నిర్మాణయత్నాల్లో పురోగతి. వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారులకు అనుకోని లాభాలు. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. క్రీడాకారులు, రాజకీయవేత్తల అనుభవాలు ప్రస్తుతం ఉపకరిస్తాయి. పరిశోధకులు, కళాకారులకు విదేశీ పర్యటనలు, సన్మానాలు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400