కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్ లిప్టింగ్లో భారత్ కు మరో పతకం దక్కింది. వెయిట్ లిఫ్టర్ లవ్‌ప్రీత్ సింగ్ 109 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. మెన్స్ 109 కేజీల విభాగంలో పోటీపడిన లవ్‌ప్రీత్ సింగ్ ఓవరాల్‌గా 355 కేజీల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. లవ్‌ప్రీత్ సింగ్ సాధించిన బ్రాంజ్ మెడల్ తో భారత్ ఖాతాలో 14 మెడల్స్ చేరాయి. ఇందులో 5 స్వర్ణం, 5 రజతం, 4 కాంస్య పతకాలున్నాయి.
LOVEPREET WINS BR?NZE !!
— SAI Media (@Media_SAI) August 3, 2022
The weightlifting contingent is giving us major MEDAL moments at #CommonwealthGames2022?
Lovepreet Singh bags Bronze? in the Men's 109 Kg category with a Total lift of 355 Kg
Snatch- 163Kg NR
Clean & Jerk- 192Kg NR
Total - 355kg (NR) pic.twitter.com/HpIlYSQxBZ
లవ్ ప్రీత్ సింగ్..స్నాచ్ కేటగిరీ మూడు ప్రయత్నాల్లో వరుసగా 157, 161, 163 కేజీలు విజయవంతంగా ఎత్తాడు. ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్ మూడు ప్రయత్నాల్లోనూ వరుసగా 185, 189, 192 కేజీలు ఎత్తి పతకాన్ని దక్కించుకున్నాడు. 109 కేజీల విభాగంలో కామెరూన్ కు చెందిన పరిక్లెక్స్ ఎన్‌గజ యబెయు స్వర్ణం పతకాన్ని సాధించాడు. అతను 361 కేజీల బరువునెత్తాడు. సమోవాకు చెందిన జాక్ హిటిలా 358 కేజీలు లిఫ్ట్ చేసి సిల్వర్ను సొంతం చేసుకున్నాడు.
కామన్వెల్త్ లో కాంస్యం సాధించడం సంతోషంగా ఉందని లవ్ ప్రీత్ సింగ్ అన్నాడు. పతకం కోసం నావంతుగా కృషి చేశానని చెప్పాడు. కాంస్యపతకాన్ని దేశానికి, తన కుటుంబానికి అంకింతం ఇస్తున్నట్లు తెలిపాడు.
Birmingham, UK | I feel good, this was my first major competition. I did my best today, live on the stage. Would like to dedicate my medal to my country & my family: Weightlifter Lovepreet Singh on winning the bronze medal in men's weightlifting 109 Kg weight category pic.twitter.com/4KskwcnhJI
— ANI (@ANI) August 3, 2022