సస్టెయినబుల్ ​సమిట్ ​నిర్వహించిన వీ వర్క్

సస్టెయినబుల్ ​సమిట్ ​నిర్వహించిన వీ వర్క్

హైదరాబాద్, వెలుగు:  ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ ప్రొవైడర్​ వీ వర్క్ ఇండియా తన సుస్థిర సదస్సు రెండో ఎడిషన్ ను హైదరాబాద్​లో నిర్వహిస్తోంది. వ్యాపారాలు, సమాజానికి పర్యావరణానికి అనుకూల పద్ధతులు, పరిష్కారాల గురించి చర్చించడానికి పరిశ్రమ నాయకులు, నిపుణులు, విధాన నిర్ణయకర్తలను ఒకచోట చేర్చింది. ఇది భారతదేశాన్ని సుస్థిర భవిష్యత్తు వైపు నడిపిస్తుందని తెలియజేసింది. 

ఈ సందర్భంగా పర్యావరణ అంశాలపై చర్చలు, కీలకోపన్యాసాలు, వర్క్​షాప్​లు జరిగాయి. వీటికి పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఇన్నోవేటర్లు హాజరయ్యారు.  మొక్కలను పెంచడం, గ్రీన్​బిల్డింగ్స్​, ఉద్గారాలను తగ్గించడం, వ్యర్థాల సేకరణ గురించి నిపుణులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. సుస్థిర‌‌‌‌‌‌‌‌త స‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌స్సు గురించి వీ వర్క్ ఇండియా సీఈఓ కరణ్ విర్వానీ మాట్లాడుతూ జీరో-కార్బన్ భవిష్యత్తును సాధించడం తమ లక్ష్యమని తెలిపారు.