123 జీవో ప్రకారం పరిహారం ఇవ్వడం ఏంది? : సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క

123 జీవో ప్రకారం పరిహారం ఇవ్వడం ఏంది? : సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క
  • మానవీయ కోణంలో ఆలోచించి న్యాయం చేయాలె
  •  సీఎం కేసీఆర్​కు సీఎల్పీ నేత భట్టి లెటర్​

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : పాలమూరు, రంగారెడ్డి వట్టెం ప్రాజెక్టు విషయంలో నిర్వాసితులకు అన్యాయం జరిగిందని, వారికి న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ కు సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. ఆదివారం నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర, తాడూరు మండలం యత్మతాపూర్, ఇంద్రకల్ గ్రామాలలో ఆయన పాదయాత్ర నిర్వహించారు. విలేకరులతో మాట్లాడుతూ పాల‌‌‌‌‌‌‌‌మూరు, రంగారెడ్డి ఎత్తిపోత‌‌‌‌‌‌‌‌ల ప‌‌‌‌‌‌‌‌థ‌‌‌‌‌‌‌‌కంలో అంత‌‌‌‌‌‌‌‌ర్భాగమైన నాగ‌‌‌‌‌‌‌‌ర్ క‌‌‌‌‌‌‌‌ర్నూల్ జిల్లా బిజినేపల్లి మండ‌‌‌‌‌‌‌‌లం వ‌‌‌‌‌‌‌‌ట్టెం రిజ‌‌‌‌‌‌‌‌ర్వాయర్ ను పాద‌‌‌‌‌‌‌‌యాత్రలో పరిశీలించానని చెప్పారు. వ‌‌‌‌‌‌‌‌ట్టెం ప్రాజెక్టులో ముంపున‌‌‌‌‌‌‌‌కు గుర‌‌‌‌‌‌‌‌వుతున్న అంకాన్ ప‌‌‌‌‌‌‌‌ల్లి తండా, కారుకొండ తండా, రామిరెడ్డి ప‌‌‌‌‌‌‌‌ల్లి తండా, జీ గుట్ట తండా గ్రామాల భూ నిర్వాసితులు తనకు సమస్యలు చెప్పుకున్నారన్నారు. ప్రాజెక్టులో 4500 ఎక‌‌‌‌‌‌‌‌రాలు, 463కు పైగా ఇండ్లు, నాలుగు తండాలు, ఒక ఊరు పోయాయన్నారు. నిర్వాసితులకు 2013 భూ సేక‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణ చ‌‌‌‌‌‌‌‌ట్టం ప్రకారం ప‌‌‌‌‌‌‌‌రిహారం, ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండ‌‌‌‌‌‌‌‌గా, జీఓ నెంబ‌‌‌‌‌‌‌‌ర్ 123 ప్రకారం ప‌‌‌‌‌‌‌‌రిహారం ఇచ్చారని మండిపడ్డారు. భూమికి భూమి అడిగిన బాధిత నిర్వాసితుల‌‌‌‌‌‌‌‌ను జైలుకు పంపుతామ‌‌‌‌‌‌‌‌ని బెదిరించ‌‌‌‌‌‌‌‌డం,  రాజ్యాంగ హ‌‌‌‌‌‌‌‌క్కుల‌‌‌‌‌‌‌‌ను కాలరాయడమేనన్నారు. ప్రాజెక్టు భూ సేక‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణ ముందు చేసిన సోష‌‌‌‌‌‌‌‌ల్ ఎక‌‌‌‌‌‌‌‌నామిక్ స‌‌‌‌‌‌‌‌ర్వేలో అవ‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌లు జరిగాయన్నారు. ప‌‌‌‌‌‌‌‌ద్దెనిమిదేండ్లు నిండిన 154 మందికి రీహాబిలిటేషన్​ప్యాకేజీ రాలేద‌‌‌‌‌‌‌‌న్నారు. నిర్వాసితులంతా ద‌‌‌‌‌‌‌‌ళిత‌‌‌‌‌‌‌‌, గిరిజ‌‌‌‌‌‌‌‌న నిరుపేద ప్రజలని, వారి గురించి మాన‌‌‌‌‌‌‌‌వీయ కోణంలో ఆలోచించి ఇంటికో ఉద్యోగం, భూమికి భూమి, ఊరికి ఊరు క‌‌‌‌‌‌‌‌ట్టించ‌‌‌‌‌‌‌‌డం, ఉపాధి అవ‌‌‌‌‌‌‌‌కాశాలు క‌‌‌‌‌‌‌‌ల్పించాల్సి ఉండేదన్నారు. తర్వాత తాడూర్ , ఇంద్రకల్​గ్రామాల్లో  కార్నర్ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు.

అధికారంలోకి తెస్తే...చేసి చూపిస్తాం

అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణ జలాలతో రైతుల కాళ్లు కడుగుతామన్నారు. అమ్మ హస్తం పథకంతో రేషన్ దుకాణాల్లో 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామన్నారు. రూ.500 గ్యాస్  సిలిండర్, ఇండ్లు కట్టుకునే వారికి రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తామన్నారు. వివిధ ప్రాజెక్టుల్లో నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించడంతో పాటు ఏకకాలంలో రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని తెలిపారు. నిర్బంధ ఉచిత విద్య చట్టం ప్రకారం ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీగా ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తామన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంచి కార్పొరేట్ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జడ్పీటీసీలు రోహిణి, రేవతి, భార్గవి, డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, వల్లభరెడ్డి, హబీబ్, సుహాసన్ రెడ్డి, శ్రీనివాస్  పాల్గొన్నారు.