
ప్రతి ఉదయాన్ని టీ లేదా కాఫీతో మొదలు పెట్టడం మనవాళ్లకు అలవాటు. నూటికి తొంభై శాతం మందికి టీ తాగకుండా డే పూర్తికాదు. అయితే టీలలో గ్రీన్, బ్లాక్, రెడ్ వంటి రకాలు ఉన్నాయి. అవి రంగుల్లోనే కాదు, రుచుల్లోనూ వెరైటీగా ఉంటాయి. వీటిలో ప్రపంచమంతటా ప్రేమస్ అయిన గ్రీన్ టీ ఒకటి. గ్రీన్ టీ అంటే తెలియని వాళ్లుండరు. దానివల్ల కలిగే లాభాల గురించి అడిగితే ఒకటకా చెప్పేస్తారు. కానీ... ఇంతకీ గ్రీన్ టీ ఎక్కడ పుట్టింది? మనదాకా ఎలా వచ్చింది? దీని వెనకున్న చరిత్రేంటి? తెలుసుకోవాలంటే.. ఇది చదవండి.
గ్రీన్ టీ వల్ల ఎన్నోరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మైండ్ రిఫ్రెష్ అవుతుంది. చర్మం మెరిసిపోతుంది. బరువు తగ్గుతుంది. ఇలా చెప్పుకుంటే పోతే బోలేడు. అందుకే దీనికి అంత డిమాండ్. అయితే శారీరకంగా, మానసికంగా అన్ని ప్రయోజనాలు ఉన్న ఈ టీని ఎక్కడ? ఎలా? కనిపెట్టారో తెలుసుకోవాలి కదా. చైనా దేశం హన్ రాజవంశ పాలనలో ఉన్నప్పుడు గ్రీన్ టీ ఆకుల పెంపకం ఉండేదని అప్పటి రికార్డుల్లో రాసుంది. అయితే, అప్పట్లో దీన్ని మెడిసిన్ లా వాడేవారు. అంటే ఇప్పటిలా రెగ్యులర్ గా వాడేవాళ్లు కాదు. అవసరమైనప్పుడు మాత్రమే తాగేవాళ్లు. అదే సంప్రదాయం చైనాలో టంగ్ రాజవంశం పాలన మొదలైన రోజుల్లో కూడా కంటిన్యూ అయింది. ఆ కాలంలో ట్రాన్స్ పోర్ట్ కి అనుకూలంగా ఉంటుందని గ్రీన్ టీ పొడిని ముద్దగా చేసి కేక్ ఆకారంలో ప్యాకింగ్ చేసేవారు. అయితే, అక్కడ గ్రీన్ టీ తాగడం అందరికీ తెలియదు. అందుకని ఆ రోజుల్లోనే దీనిపై'లు యు' అనే అతను ఒక బుక్ కూడా రాశాడు. దాని ద్యారా గ్రీన్ టీ కల్చర్ ని అందరికీ పరిచయం చేశాడు. గ్రీన్ టీ తాగడం గురించి రాసిన ఆ పుస్తకం పేరు ‘ది క్లాసిక్ ఆఫ్ టీ' లేదా ‘ఛ జింగ్’.
ఆ కాలంలో ప్రజలు దాన్ని ముఖ్యమైన పుస్తకంగా భావించేవాళ్లు. తర్వాత గ్రీన్ టీ తాగడాన్ని కూడా ఒక సెలెబ్రేషన్ లా చేసుకునేవాళ్లు. దాన్ని తర్వాతి తరాలు వాళ్లు సంప్రదాయంగా కొనసాగించారు. దానికి కావాల్సిన ప్రిపరేషన్ ముందే చేసుకునేవాళ్లు. అలా కొద్దిరోజుల్లోనే గ్రీన్ టీ తాగడం అనేది స్టేటస్ సింబల్ గా మారిపోయింది. చైనాలోని యున్నన్ ప్రావిన్స్ లో కెమిల్లా సైనెన్సిస్ జాతి మొక్కతో గ్రీన్ టీ తయారుచేస్తారు. అంతేకాదు... ప్రపంచంలో ఉన్న వందల రకాల టీలలో దాదాపు 260 రకాలు యున్నన్ లో దొరుకుతాయి.
కథలు కథలుగా..
ఒక పురాణం ప్రకారం చైనా చక్రవర్తి, చైనీస్ మెడిసిన్ అవిష్కర్తగా చెప్పుకునే షెనాంగ్, క్రీ.పూ 2737 లో టీని ఒక బేవరేజ్ గా కనుగొన్నాడు. టీ చెట్టు నుండి తాజా టీ ఆకులు తెచ్చి వేడి నీళ్లలో ఉడికించి కప్పులో పోసుకుని తాగేవాడనే కథ చెప్పుకుంటారు. మరొక కథ కూడా ఉంది. క్రీపూ. 500 కాలంలో బౌద్ధులు కనుగొన్నారట. వాళ్లు మత ప్రచారం కోసం చైనా నుంచి ఇండియాకి వచ్చిపోతూ ఉండేవాళ్లు. ఆ టైంలోనే వాళ్లు మనవాళ్లకి బౌద్ధమతం, సంస్కృతి, టీ సంప్రదాయాలను కూడా నేర్పించారు. బౌద్ధసన్యాసుల సంఖ్య పెరిగిపోవడంతో టీ ఉత్పత్తి పెరిగింది. గ్రీన్ టీ తాగడం వల్ల బాడీ రిఫ్రెష్ అవుతుంది. అది మెడిటేషన్ కి బాగా పనికొస్తుందని నమ్ముతారు. అయితే ప్రస్తుతం ఈ రెండు దేశాల్లో వాడే గ్రీన్ టీలు వేరుగా ఉన్నాయట. చైనా గ్రీన్ టీతో పోలిస్తే మనదేశంలో ముదురు కాషాయం రంగులో ఉండి స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే మన టీలో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉండొచ్చని స్టడీల్లో తేలింది.
అలా జపాన్...
గ్రీన్ టీ చైనాలోనే కాదు.. జపాన్ లోనూ పాపులర్. దాదాపు 1190 సంవత్సరంలో జెన్ అనే మతగురువు చైనా వెళ్లాడు. అక్కడున్న బౌద్ధాలయాలు, టెంపుల్స్ అన్నీ సందర్శించి, తిరిగి వచ్చేటప్పుడు టీ విత్తనాలు, మొలకలు వెంటబెట్టుకొచ్చాడు. ఎసై అనే యువ మత గురువు తన ఎక్స్ పీరియన్స్ ఉపయోగించి వాటిని పెంచాడు. తర్వాత టీ చేసుకుని చైనీయుల సంప్రదాయ పద్ధతిలో తాగేవాడు. తన తోటి కమ్యూనిటీలో ఉన్న మాంక్స్ తో కూడా టీని తాగించేవాడు. పోనుపోను ఆ ఆచారం కాస్తా జపాన్ అంతా వ్యాపించింది. ప్రస్తుతం చైనా, జపాన్ లు గ్రీన్ టీ పండించి, ఎగుమతి చేయడంలో టాప్ లో ఉన్నాయి.
ALSO READ | ఆ ఊళ్ళో మనుషులు ఇళ్లలో కాదు.. పుట్టల్లో ఉంటారు.. ఎక్కడుంది..? ఎలా వెళ్ళాలి..?