Guru Purnima 2024:   గురువు అంటే ఏమిటి.. గురుపౌర్ణమి ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసా

Guru Purnima 2024:   గురువు అంటే ఏమిటి.. గురుపౌర్ణమి ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసా

హిందువుల  అన్ని పండుగల కంటే గురుపౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది.  ఆషాఢమాసం శుక్ల పక్ష పౌర్ణమిని గురు పౌర్ణమిని , వ్యాస పౌర్ణమి అంటారు.   మనకు జ్ఞానాన్ని ప్రసాదించి, జీవితాన్ని ముందుకు నడిపించడంలో సాయపడిన ప్రతి గురువుకు కృతజ్ఞత చెప్పుకోవడమే గురుపౌర్ణమి ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ రోజు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ గురువులను పూజిస్తారు.

మనిషి తల్లి కడుపులోనే అన్నీ నేర్చుకుని మనిషి బయటకురాడు. బయటపడ్డాక ఎదుటి వాళ్లను చూసి నేర్చుకుంటాడు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఎవరో ఒకరు మనకు ఏదో ఒక విధంగా సాయం చేస్తూనే ఉంటారు. అది మాట సాయం కావొచ్చు. పని సాయం కావొచ్చు. ఎవరి సాయం లేకుండా మనిషి బతకగలడా?.. అందుకే పుట్టగానే అమ్మానాన్నలతో, పెద్దయ్యాక జీవిత భాగస్వామితో, ముసలితనం వచ్చిన తరువాత పిల్లలతో గడుపుతాడు. .

గురువు అంటే..

సంస్కృతంలో 'గు' అనే శబ్దానికి చీకటి అని అర్థం. 'రు' అంటే నాశనం చేసే తేజస్సు అని అర్ధం. అజ్ఞానం అనే చీకటిని.. తొలగించి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించేవాడే గురువని అర్ధం. మన గమ్యానికి దారి చూపించేవాడే గురువు. మనకు తెలియని విషయాలను చెప్తూ. అజ్ఞానాన్ని తొలగించే గురువు జ్ఞానసంపన్నుడు. గుణసంపన్నుడై ఉంటాడు. అంతేగానీ, ఆయనకు అందమైన రూపంతో ఉండాలనేం లేదు. గురువు రూపాతీతం.మాటలు అమ్మ నేర్పితే... నడకలు నాన్న నేర్పుతాడు. చదువు, జ్ఞానాన్ని బడిలో గురువు పంచుతాడు. ఈ జీవితాన్ని ఏ దారిలో నడిపించాలి? ఏ దారిలో ఏముంటాయ్? ఎటువైపు, ఎట్లా నడవాలి? అని చెప్పి, నడిపించడం ఒక్క గురువుకే సాధ్యం

Also Read :- ఇక్కడి తాబేళ్లు సంథింగ్ స్పెషల్

గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః,
 గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః

 అని చిన్నప్పుడు టీచర్ క్లాస్​ లో అడుగు పెట్టగానే పాడుకునేవాళ్లం కదా! "


గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, అలాంటి గురువుకి నమస్కరిస్తున్నాను' అని దీనికి అర్థం. గురువులకు మన సంస్కృతి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో ఈ శ్లోకం చెబుతుంది. 

కేవలం మనకు చదువు చెప్పేవాళ్లే గురువులు కాదు. జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్లెవరైనా మనకు గురు సమానులే. ఒక గొప్ప గురువు తన శిష్యునికి ఎక్కడ ప్రశాంతత లభిస్తుందో ఆ గమ్యానికి దారి చూపిస్తాడు. దానికోసం ఆయన దగ్గరున్న జ్ఞానాన్ని పంచుతాడు. తను నడిచొచ్చిన దారుల్లో కలిగిన అనుభవాలను చెప్తాడు. ఎటు పోతే ఏం ఉంటది, ఏమైతదో చెప్పి మిమ్మల్ని మీరు వెలిగించుకునేలా డైరెక్షన్ చేస్తాడు. ఇందుకు గురువు మాట్లాడేటప్పుడు సైలెంట్ గా వినాలి. ఆ తర్వాతే..సందేహాలు అడగాలి. నిజమైన గురువే మీకు  జీవితాంతం సపోర్ట్ గా నిలబడ్డాడు. కష్టకాలంలో కన్నీరు మున్నీరవుతూ ఆయన కాళ్లదగ్గరకు చేరితే తప్పకుండా ఏదో ఒక దారి చూపిస్తాడని ఇస్తుందో ఈ శ్లోకం చెప్తుంది.