ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా శనివారం (జూన్ 17) తెల్లవారుజామున ఈ సమస్య మొదలైంది. లక్షలాది మంది యూజర్లు, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ లను యాక్సెస్ చేయలేకపోయారు. చాలా సేపు వాట్సాప్‌లో మెసేజ్‌లు సెండ్ అవలేదు. రిసీవ్ కాలేదు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు మెసేజ్‌లు పంపడానికి ఇబ్బంది పడ్డారు. ఇన్ స్టాగ్రామ్లో స్టోరీలు లోడ్ అయినప్పటికీ..ఎర్రర్ మెసేజ్ లు వచ్చాయి. దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. వాట్సాప్, ఫేస్ ముక్ మెసేంజర్లలో సందేశాలను పంపడంలో స్వీకరించడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు నివేదించారు. డౌన్‌డెటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారంఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ సేవలకు రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. సేవల అంతరాయాన్ని ఇన్‌స్టాగ్రామ్ అంగీకారించింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వినియోగదారులకు హామీ ఇచ్చింది.
ట్విట్టర్ లో విమర్శలు..
ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ సేవలకు అంతరాయం కలగడంతో యూజర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ అసంతృప్తిని ట్విట్టర్ లో వ్యక్తీకరించారు. ఈ యాప్స్ లో ఎదుర్కొన్న సమస్యలను హైలైట్ చేస్తూ మీమ్‌లు, GIFలను పోస్ట్ చేశారు.
ఇది మొదటి సారి కాదు..
ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మేలో గంటకు పైగా ఇన్ స్టాగ్రామ్ డౌన్ అయింది. వాట్సాప్ కూడా జూన్ మొదటి వారంలో దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయింది. ఫోటోలు, వీడియాలు పంపడం, డౌన్ చేయడంలో యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొబైల్, డెస్క్‌టాప్ లలో వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ ను యాక్సెస్ చేయడంలో వినియోగదారులు సమస్యలు ఎదుర్కొన్నారు.