మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులు తమ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌ల కోసం పాస్‌వర్డ్ సరైనదేనా అని ధృవీకరించడానికి అనుమతించే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఒకవేళ అది తప్పుగా ఉన్నట్టయితే దాన్ని మళ్లీ రీప్లేస్ చేయవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఐవోఎస్(iOS), ఆండ్రాయిడ్ (Android) యూజర్స్ కు అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం యాప్ ను అప్ డేట్ చేసి తాజా వెర్షన్‌లను పొందవచ్చని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.
రెండు సంవత్సరాల క్రితం, Meta-యాజమాన్యం ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌లను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ని ఉపయోగించడం ద్వారా వ్యక్తిగత పాస్‌వర్డ్ లేదా 64-అంకెల ఎన్‌క్రిప్షన్ కీని ఎంచుకోవడం ద్వారా వారి బ్యాకప్‌లను సురక్షితం చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం ఉంటుంది.
“వాట్సాప్ లేదా బ్యాకప్ సర్వీస్ ప్రొవైడర్లు ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌లు లేదా డిక్రిప్షన్ కోసం అవసరమైన కీని యాక్సెస్ చేయలేరు. బ్యాకప్ డేటాబేస్‌ను ప్రొటెక్టెడ్ గా ఉంచడానికి వాట్సాప్ గతంలో ఎన్‌క్రిప్షన్ టెక్నిక్‌లను ఉపయోగించినప్పటికీ, అది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందించలేదు" అని WABetaInfo నివేదించింది.