కొత్త సంవత్సరం 2025 ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు ఎప్పుడు ఉంటుందా అని ఎదరుచూస్తుంటారు. జనవరి - జూన్ అర్థవార్షిక గడువు సమీపిస్తుటంతో డీఏ పెంపు ఎప్పుడు ఉంటుందా అనే చర్చ సహజంగానే మొదలవుతుంది. రివైజ్ చేసిన ప్రణాళిక ప్రకారం సుమారు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏడాదికి రెండు దఫాలుగా డీఏ చెల్లించాల్సి ఉంది.
7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు డీఏ పెంపు ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) ఆధారంగా నిర్ధారిస్తారు. దేశంలో పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం (ఇన్ ఫ్లేషన్) ఆధారంగా AICPI ని నిర్ధారిస్తారు.
డీఏ ఎంత ఉండవచ్చు:
అక్టోబర్ 2024 ప్రకారం AICPI విలువ 144.5 కు చేరుకుంది. నవంబర్, డిసెంబర్ డాటా ప్రకారం అది 145.3 వరకు చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం జనవరి 2025లో డీఏ 56 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
డీఏ పెంపు ఎప్పుడు ప్రకటించవచ్చు:
పూర్తి స్థాయి డీఏను నిర్ణయించేందుకు కేంద్రానికి నవంబర్, డిసెంబర్ డాటా అవసరం ఉంటుంది. నవంబర్ డాటా జనవరి మొదటి వారంలో, డిసెంబర్ డాటా ఫిబ్రవరిలో అందుబాటులోకి వస్తుంది. దీని ప్రకారం తదుపరి సమీక్ష ఫిబ్రవరి చివరి వరకు చేస్తారు. గతంలో పంచిన వివరాల ప్రకారం సమీక్ష జరిపిన అనంతంర రెండు నెలలలోపే డీఏ ప్రకటించనున్నారు.
ALSO READ | గుడ్ న్యూస్.. ఇకపై తిరుమలలో చెల్లుబాటు కానున్న తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు
అక్టోబర్ 2024లో కేంద్ర కేబినెట్ 3 శాతం డీఏ పెంపుకు ఆమోదించింది. అంతకు ముందు 50 ఉన్న డీఏ ఆ తర్వాత 53 శాతానికి చేరుకుంది. ఈ సారి మరో 3 శాతం పెంపుతో 56 శాతం వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.