Sriramanavami 2025: సీతమ్మ తల్లి అవతారం ముగించిన స్థలం ఇదే..!

Sriramanavami 2025:  సీతమ్మ తల్లి అవతారం ముగించిన స్థలం ఇదే..!

శ్రీరామచంద్రుని ధర్మపత్ని సీతాదేవి.. ఈ విషయం అందరికి తెలిసిందే.. శ్రీరాముడు తండ్రి మాట ప్రకారం అడవులకు వెళ్లడం.. ఆ తరువాత మళ్లీ పట్టాభిషేకం జరగడం.. ఎవరో అన్న మాటలకు ..మళ్లీ సీతమ్మ తల్లిని అడవులను పంపించడం.. సీతాదేవి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతలో ఐక్యం అయ్యింది అన్న విషయం అందరికీ తెలుసు...మరి అదెక్కడుంది? ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఆనవాళ్లు ఉన్నాయి?  ఆ ప్రాంత విశేషాలేంటో  ఈ స్టోరీలో తెలుసుకుందాం... 

సీతమ్మ తల్లి తనువు చాలించిన ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు .. అలహబాద్ మరియు వారణాసిలను కలిపే రెండవ నంబరు జాతీయ రహదారికి సుమారు 4 కి. మీ. దూరంలో దక్షిణ దిక్కుగా ఉంటుంది.   ఈ ప్రదేశాన్ని ‘సీత సమాహిత్ స్థల్’ అని ‘సీత మారి’ అని కూడా పిలుస్తారు.  సీతా సమాహిత్ స్థల్ లో  ఒకే ఒక గుడి ఉంది.. చూడటానికి స్మారకంలా ఉంటుంది. ఈ గుడి..స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉన్నది. ఈ ఆశ్రమంలోనే జానకి దేవి.. రెండోసారి  అడవుల పాలైనప్పుడు నివాసము ఉండేది. ఆశ్రమానికి పక్కనే లవ కుశలకు జన్మనిచ్చిన స్థలం అయిన సీత వటవృక్షం కూడ ఉంటుంది.

 ఇక స్మారకం విషయానికి వస్తే, అది ముచ్చటగా రెండు అంతస్థుల నిర్మాణం. పై అంతస్తులోని అద్దాల మంటపంలో అమ్మ వారి పాలరాతి విగ్రహం ఉంటుంది. అలాగే కింద భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మవారి ప్రతిమను చూస్తుంటే …. ఎంతటి వారికైన బాధ కలిగించే విధంగా ఉంటుంది.

ALSO READ | Sri rama navami 2025: శ్రీరామ నవమి రోజు ఇంట్లో ఇలా పూజ చేస్తే... జాతకంలో గ్రహదోషాలు పోతాయి..

 వెనక గోడల మీద ఆ సంఘటనలను చూపిస్తున్న సన్నివేశపు శిలా చిత్రం కనిపిస్తుంది. తమసా నది పరిసర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఒకటుంది.  ఈ స్మారక కట్టడం నిర్మాణం జరుగక ముందు ఇక్కడ అమ్మ వారి జుట్టుని తలపించేట్టుగా కేశ వాటిక ఉండేదని అక్కడి స్థానికులు చెబుతారు. అక్కడ మొలిచిన గడ్డిని పశువులు కూడా తినేవి కాదట. స్మారకాన్ని నిర్మించేటప్పుడు ..సీతా కేశ వాటికను పాడు చేయకుండ అలాగే ఉంచారు.. 

స్మారక వివరాల్లోకి వెళితే, దీన్ని స్వామి జితేంద్రానంద తీర్థులవారి ఆదేశం మేరకు ఇక్కడ నిర్మించారు. సన్యాసం స్వీకరించిన ఆయన ఋశికేష్ ఆశ్రమంలో కాలం గడుపుతుండగా, దేవి అనుగ్రహం మేరకు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి కాలినడకన బయలుదేరి చేరుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.

 అప్పుడు ఆయన ఈ స్థలంలో స్మారకం నిర్మించాలని పరితపించి దాతలందరినీ కలుస్తాడు. చివరికి ప్రకాశ్ పున్జ్ గారి సాయంతో కల నెరవేర్చుకుంటారు తీర్థుల వారు. ఆలయం పక్కనే జీవకళ ఉట్టిపడే విధంగా తీర్థులవారి సమాధి ఉన్నది.. ఇక్కడ సీతమ్మతో పాటు శివుని విగ్రహం, 20 అడుగుల కృత్రిమ రాతి పై నిర్మించిన 108 అడుగుల హనుమంతుడు కూడ ఉన్నాడు . ఈ రాతి నిర్మాణం కింద గుహలో చిన్న హనుమన్ దేవాలయం ఉంటుంది.