
ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. కిచెన్ బెడ్ రూం.. హాల్.. డైనింగ్.. స్టోర్ రూం ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. వాస్తు సిద్దాంతి సలహా..సూచన మేరకు ఉండాలి. వీటితో పాటు బాల్కనీ ని కూడా వాస్తు ప్రకారమే నిర్మించుకోవాలి. ఇంటిలో బాల్కనీ ఏ దిక్కులో ఉండాలో.. వాస్తు పండితులు కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారి సలహాలను పరిశీలిద్దాం. . .
ప్రశ్న: ఇంటికి సంబంధించి ప్రతిదానికీ వాస్తు వర్తిస్తుంది. అలా బాల్కనీలకు కూడా ఉంటుందా? ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్ లోని పోర్షన్లో అద్దెకు ఉంటున్నాం. అయితే ఆ బాల్కనీ తూర్పునకు ఉంది. అది మంచిదేనా? కాని కొంతమంది ఇళ్లలో మాత్రం బాల్కనీ పడమర దిక్కుకు ఉంది. అది కూడా వాస్తు ప్రకారం మంచిదేనా? అసలు బాల్కనీలు ఏ వైపునకు ఉండాలి? అలాగే ఎక్కడ ఉండకూడదు..
జవాబు: ఇంటికి సంబంధించి అన్నింటికీ వాస్తు వర్తిస్తుంది. అందులో భాగంగానే బాల్కనీలకూ ఉంటుంది. అవి సరైన చోట లేనప్పుడు చెడు ప్రభావాలు కచ్చితంగా ఉంటాయి. మీరు అద్దెకు ఉంటున్న ఇంట్లో బాల్కనీ వాస్తు ప్రకారమే ఉంది. కానీపడమర దిక్కున ఉన్న బాల్కనీ వాస్తు ప్రకారం లేదు. బాల్కనీలు అనేవి తూర్పు, ఉత్తరం, ఈశాన్యం దిక్కుగా ఉండాలి. అప్పుడు ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు. వీలైనంత వరకు బాల్కనీ దక్షిణం... పడమర దిక్కుల్లో లేకుండానే చూసుకోవాలి..
–వెలుగు,లైఫ్–