
- విప్ బీర్ల ఐలయ్య
హైదరాబాద్, వెలుగు: నల్గొండలో రైతు ధర్నా పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కామెడీ షో చేశారని విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ రైతు ధర్నా అట్టర్ ప్లాప్ అయిందని విమర్శించారు. వ్యక్తిగతంగా షో చేయడం తప్ప, అక్కడికి వెళ్లి ఆయన చేసిందేమి లేదని ఫైర్ అయ్యారు.
చివరకు బీఆర్ఎస్ క్యాడర్ కూడా కేటీఆర్‌ను పట్టించుకోలేదని తెలిపారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఏ మాత్రం పట్టించుకోని కేసీఆర్, కేటీఆర్.. ఇప్పుడు అధికారం కోల్పోగానే మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లా నుంచే బీఆర్ఎస్ పతనం మొదలైందని, కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు గ్రామాల్లో తిరగనివ్వరని, రాళ్లతో కొడతారని హెచ్చరించారు.