కొత్త వధూవరులు గోరుముద్దలు తినిపించుకుంటారు. ఇలా కొంతకాలం ఒకే కంచంలో భోంచేస్తారు కూడా. కాని కొన్నాళ్లకు ఎవరి ఫుడ్ వారే తింటారు. కొత్తలో ఉన్నంత హడావిడి ఉండదు. అలా ఉండకపోయినా కనీసం భార్య తింటుందా లేదా అన్న విషయం పట్టించుకోవాలి. కాని ఓ ప్రబుద్దుడు వండిన ఆహారం ఎంత ఉంది.. తాను ఎంత తినాలి.. భార్య ఎంత తినాలి.. అన్న విషయం ఆలోచించకుండా భోజన పాత్రను గమనించకుండా అన్నం వడ్డించమని పదే పదే అడుగుతున్నాడు. అప్పుడు ఆ భార్య తన ప్లేట్ లోని ఆహారాన్ని తీపి గిన్నెలో వేసి మరల భర్తకు వడ్డించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
భర్త కష్టసుఖాల్లో పాలుపంచుకునేది కేవలం భార్య మాత్రమే. భర్తే తన శ్వాస అన్నట్టుగా భార్య జీవిస్తోంది. అలాంటి భర్తకు ఏదైనా కష్టం వస్తే భార్య తట్టుకోలేదు. అతడికి అండగా నిలబడి, మనోధైర్యాన్ని కల్పిస్తుంది. తాను ఉపవాసం ఉండి కూడా తన భర్త కడుపు నింపుతోంది భార్య. ఈ మాదిరిగానే ఓ భార్య తన అన్నాన్ని భర్త ప్లేట్లో వడ్డించి తాను ఏదో కొన్ని మెతుకులు తిని కడుపు నింపుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
భార్యాభర్తలు ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్నారు. భర్త ఓ వైపు తింటూనే.. మరో వైపు ఫోన్‌లో మునిగిపోయాడు. తన ప్లేట్లో ఉన్న అన్నం అయిపోతుంది. మళ్లీ వడ్డిద్దామంటే పాత్రలో అన్నం లేదు. దీంతో భార్య తన ప్లేట్లో ఉన్న అన్నాన్ని తన భర్త ప్లేట్లో వేస్తుంది. ఈ విషయాన్ని భర్త గమనించకుండా భోజనం కానిచ్చేస్తాడు. ఇక భార్య ఏవో కొన్ని మెతుకులు తిని కడుపు నింపుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
భర్త ఆకలి తీర్చేందుకు భార్యలు తాము తినకుండా మిగిలిన ఆహారం కూడా భర్తకే పెట్టేందుకే మొగ్గుచూపుతుంటారు. ఇలాంటి ఓ ఘటనను హైలెట్ చేస్తూ కంటెంట్ క్రియేటర్ ఓ జంట వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్‌లో భార్య తాను వడ్డించుకున్న ఆహారాన్ని కూడా భర్తకు వడ్డిస్తుంటే అతడు ఆమె త్యాగాన్ని పట్టించుకోకుండా ఫోన్‌లో మునిగితేలుతుండటం కనిపిస్తుంది. ప్లేటు ఖాళీ చేసిన ప్రతిసారి అన్నం వడ్డించాలని భార్యకు ఆర్డర్ వేస్తుంటాడు. గిన్నెలో రైస్ లేకపోవడంతో ప్రతిసారీ ఆమె తన ప్లేట్‌లో రైస్‌ను గిన్నెలో వేసి ఆపై భర్తకు వడ్డిస్తుంటుంది. ఇవేమీ పట్టించుకోని భర్త ఫోన్ చూసుకుంటూ పలుసార్లు అన్నం వడ్డించాలని అడుగుతుంటాడు.
అయితే భర్తల కోసం భార్యలు ఎన్నెన్నో త్యాగాలు చేస్తుంటారు. తన కడుపు మాడ్చుకొని కూడా అతని కడుపు నింపితే.. ఇదేనా మనం ఆడవారికి ఇచ్చే గౌరవం అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఫోన్‌లో మునిగిపోయాడు కానీ.. తన భార్య తింటుందా..? లేదా..? అన్న విషయాన్ని గమనించకపోవడం దారుణం అని మరికొందరు తిట్టిపోస్తున్నారు.