
వరుస ఓటములతో సెమీస్ ఆశలకు గండి పడే అవకాశం ఉందన్న ఆందోళనలో చెన్నై సూపర్ కింగ్స్.. శుక్రవారం (ఏప్రిల్ 11) మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. అదే టైమ్ లో చెపాక్ లో తప్పక గెలిచి పాయింట్స్ టేబుల్ లో టాప్ 4 లో ఉండేలా చూసుకోవాలనే ప్రయత్నంలో కోల్ కతా నైట్ రైడర్స్. వెరసి ఇవాళ్టి మ్యాచ్ హై ఇంటెన్స్ మ్యాచ్ గా మారుతుందని ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకున్నారు. దీనికితోడు గాయం కారణంగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ అందుబాటులో లేకపోవడంతో.. ఐదు టైటిల్స్ అందించిన ధోనీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడం మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఈ పరిస్థితుల్లో చెపాక్ స్టేడియంలో శుక్రవారం గెలుపు ఎవరిని వరిస్తుందా అనే చర్చలు మొదలయ్యాయి.
వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడుతూ వస్తున్న చెన్నైని ధోనీ బయటపడేస్తాడని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఇవాళ చిదంబరం (చెపాక్) స్టేడియంలో జరిగే 25వ మ్యాచ్ లో చెన్నై గెలుపు బాటలోకి వస్తుందా అనేది చర్చలు నడుస్తున్నాయి. పాయింట్స్ టేబుల్ లో 9వ స్థానంలో ఉన్న చెన్నైకి ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ గా మారింది. అదే క్రమంలో రహనే కెప్టెన్సీలో దూకుడు మొదట దూకుడు మీద కనిపించిన కోల్ కతా.. మళ్లీ విజయాల పరంపర కొనసాగించాలని చూస్తోంది.
ఈ పరిస్థితుల్లో ధోనీ కెప్టెన్సీ పగ్గాలు చేపడుతున్నాడు. 2008 నుంచి 2024 వరకు టీమ్ ను లీడ్ చేసిన ధోనీ.. రుతురాజ్ కు బాధ్యతలు అప్పగించక ముందు సూపర్ కింగ్స్ కు ఐదు టైటిల్స్ అందించాడు. అయితే ఈ సీజన్ లో మాత్రం ఆడిన ఐదు మ్యాచ్ లలో నాలుగు ఓడిపోయి ఢీలా పడింది. మరోవైపు కోల్ కతా లక్నో మ్యాచ్ లో స్వల్ప తేడాతో ఓడినప్పటికీ.. ఈ మ్యాచ్ లో గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్ గా దూసుకెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది.
చెపాక్ పిచ్ ఎవరికి అనుకూలం:
చెపాక్ పిచ్ స్లో గా ఉంటుంది. బ్యాటింగ్ కు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ పిచ్ పై స్పిన్నర్లదే పైచేయి. అందువలన రెండు జట్లు స్పిన్నర్లను ఎక్కువగా దింపే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పిచ్ పై ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ రిజల్ట్స్ చూస్తే.. ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న వాళ్లకే అవకాశాలు ఎక్కువ.
హెడ్ టు హెడ్.. ఎవరిది పైచేయి:
కోల్ కతా వర్సెస్ చెన్నై జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో చెన్నైదే పైచేయిగా ఉంది. ఈ రెండు టీమ్స్ మధ్య మొత్తం 30 మ్యాచ్ లు జరగగా.. చెన్నై 19 గెలిచింది. కోల్ కతా 10 గెలిచింది. ఒకటి ఫలితం తేలలేదు. అయితే హోమ్ గ్రౌండ్ లో కోల్ కతాను ఓడించాలని చెన్నై వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ కీలక పాత్ర పోషించే చాన్సెస్ ఉన్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకునే టీమ్.. మ్యాచ్ పై పట్టు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి.. కాసేపట్లో స్టార్ట్ అయ్యే ఈ మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉంటుందో.