షాపింగ్​కు తీసుకెళ్లి మహిళపై లైంగికదాడి

షాపింగ్​కు తీసుకెళ్లి మహిళపై లైంగికదాడి
  • వీడియో తీసి ఆపై బెదిరింపులు 

జూబ్లీహిల్స్, వెలుగు: షాపింగ్ కు అని  బయటకు తీసుకెళ్లి మహిళపై లైంగికదాడికి  పాల్పడిన ఘటన హైదరాబాద్  బంజారాహిల్స్​లో జరిగింది.  బిహార్​కు చెందిన ఓ మహిళ బతుకుదెరువు కోసం నాలుగు నెలల కింద భర్త, ఇద్దరు పిల్లలతో సిటీకి వచ్చి బంజారాహిల్స్​లో ఉంటుంది. వీరి సొంతూరుకు చెందిన ఓ యువకుడు మూడు రోజుల కింద మహిళను ఆటోలో షాపింగ్​కి తీసుకెళ్లాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆమెతో మత్తు మందు కలిపిన పాలు తాగించాడు. స్పృహ కోల్పోయాక ఓ హోటల్​కు తీసుకెళ్లి లైంగికదాడి చేస్తూ వీడియో తీసుకున్నాడు. ఆ తర్వాత  వీడియోని చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నాడు.  ఆమె బంధువులకు పంపుతానంటూ బ్లాక్ ​మెయిల్​చేస్తుండగా  బాధితురాలు గురువారం పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై కేసు నమోదైంది.