కొడుకు మందలించాడని తల్లి సూసైడ్‌‌

కొడుకు మందలించాడని తల్లి సూసైడ్‌‌

ఖిల్లాగణపురం, వెలుగు : కల్లు తాగొద్దని కొడుకు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మానాజీపేటలో గురువారం జరిగింది. ఎస్సై సురేశ్‌‌గౌడ్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... మానాజీపేట గ్రామానికి చెందిన తలారి కాశమ్మ (68) తరచుగా కల్లు తాగుతుండడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. 

ఇదే విషయమై గురువారం మరోసారి గొడవ జరిగింది. దీంతో కాశమ్మ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి ఇండ్లలో వెదికారు. అయినా ఆచూకీ దొరకకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. గ్రామ శివారులోని చెరువు వద్ద కాశమ్మ చెప్పులు కనిపించడంతో నీటితో వెదకకా ఆమె డెడ్‌‌బాడీ దొరికింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. మృతురాలి కుమారుడు శ్రీను ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.