భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పని చేస్తున్న పొడిచేటి సీతారామచంద్ర చార్యులు పై కోడలిని లైంగికంగా వేధిస్తున్నాడని తాడేపల్లి గూడెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మామ వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్యాయత్నం చేసిందని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో తాడేపల్లిగూడెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రధాన అర్చకులు విధులకు హాజరు కావడం లేదని,అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిపిన ఈవో రమాదేవి తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం లో ప్రధాన అర్చకులు గా పనిచేస్తున్న రామచంద్రా చార్యులు కి పెంపుడు కుమారుడు కి వివాహం తాడేపల్లి గూడెం కి చెందిన మహిళతో వారి సాంప్రదాయాల ప్రకారం వివాహం జరిగింది.
కొంత కాలంగా కోడలిని... మామ రామచంద్రాచార్యులు శారీరకంగా లైంగిక వేధింపులకు గురి చేస్తూ కోరిక తీర్చమని వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడని ఆరోపణలు వచ్చాయి. .రామచంద్రాచార్యులు వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్ళి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు, ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి .. ఈ ఘటన పై ఆరా తీయగా అసలు విషయం చెప్పడంతో తాడేపల్లి గూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
భద్రాచలం దేవాలయంలో రామచంద్రాచార్యులు విధులకు గైర్హాజరై.. విదేశాల్లో రామయ్య కల్యాణాలు చేయిస్తున్నమని గొప్పలు చెప్పుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఆలయ ఈవో రమాదేవిని వివరణ కోరగా ... విధులకు సరిగా హాజరు కావడం లేదని అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.,