సైకాలజీ : మహిళలకు సోషల్​ సపోర్ట్​ ఉంటే.. పదేళ్లు ఆయుష్షు పెరుగుతుందట.. !

సైకాలజీ : మహిళలకు సోషల్​ సపోర్ట్​ ఉంటే.. పదేళ్లు ఆయుష్షు పెరుగుతుందట.. !

ఏదైనా అవసరం పడినప్పుడు లేదంటే ఆపద సమయంలో పక్కన ఎవరో ఒకరు ఉంటే బాగుండు అనుకుంటాం. అది కుటుంబ సభ్యులైనా కావొచ్చు.. స్నేహితులే కావొచ్చు. వాళ్ల సహకారంతో సమస్య నుంచి బయటపడతాం. అంటే ఎవరో ఒకరి ప్రోద్బలంతో జీవితంలో ముందుకు సాగడం అన్నమాట. దీనినే సోషల్ సపోర్ట్ అంటారు. అయితే వయసు పైబడుతున్న మహిళల్లో సోషల్ సపోర్ట్ వాళ్ల ఆయుష్షు పై ప్రభావం చూపిస్తుందని కొన్ని  అధ్యయనాలు చెబుతున్నాయి. 

వయసు పైబడుతున్న మహిళకు సామాజిక మద్దతు ఎక్కువగా ఉంటే వాళ్లు ఎక్కువ కాలం జీవిస్తారని మానసిక వైద్యులు చెబుతున్నారు. సోషల్ సపోర్ట్ లేనివాళ్లతో పోలిస్తే సోషల్ సపోర్ట్ ఉన్నవాళ్లు ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువగా జీవించే అవకాశం ఉంది. వీళ్లతో పోలిస్తే సోషల్ సపోర్ట్ తక్కువగా ఉన్నవాళ్లలో మరణాల సంఖ్య 20 శాతం ఎక్కువగా ఉంటోందని పరిశోధకులు వివరించారు. 

లైఫ్ స్టైల్ పై ప్రభావం

 సోషల్ సపోర్ట్ ఉన్నవాళ్లు. లేనివాళ్లకి మధ్య జీవన విధానంలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. సామాజిక మద్దతు ఉన్నవాళ్లకు సలహాలు ఇచ్చేవాళ్లు ఉంటారు. ఆ విధంగా వాళ్లు ఒత్తిడి నుంచి బయటపడతారు. ఒంటరితనం దూరం చేసుకుంటారు. పలువురితో కలవటంతో జీవన విధానంలో సంతృప్తి పొందుతున్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానంతో గుండె జబ్బులకు కూడా దూరం అవుతున్నారు. దీంతో వారి ఆయుష్షు కూడా పెరుగుతోంది. 

ALSO READ | ఆధ్యాత్మికం: గుడికి వెళ్తే సమస్యలు పరిష్కారమవుతాయా..పూజ చేస్తే ఎవరి సాయం అవసరం లేదా..!

సోషల్ సపోర్ట్​ లేని వాళ్లకు సలహాలు ఇచ్చేవాళ్లు తక్కువ.. చెడు అలవాట్లకు బానిసలై అనారోగ్యం బారినపడతారు. వివాహ సంబంధాలు, రోజువారీ కార్యక్రమాలు, అలవాట్లు, అభిరుచులు ఇలా అన్ని అంశాల్లో సోషల్ సపోర్ట్ ఉన్న మహిళలకు-తేడాలు ఉంటున్నాయి. ఈ కాలంలో మహిళలు ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్​గా  ఉంటున్నారు. ఇది ఒకరకంగా వాళ్ల మానసిక సంతోషం పెరిగేందుకు కారణం అవుతోందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

–వెలుగు, లైఫ్​‌‌–