వీణవంక, వెలుగు: నల్లా నీళ్లు రావడం లేదంటూ వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి మహిళలు బుధవారం బిందెలతో రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో మూడు నెలలుగా సరిగా నల్లానీళ్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.
వారానికి ఒక్కసారే నీళ్లు రావడంతో వ్యవసాయ బావుల దగ్గరకు వెళ్లి తీసుకొచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు రావడం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు.