మహిళల ఆసియాకప్ టీ20 టోర్నీ ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం(జులై 28) టైటిల్ పోరులో ఆతిథ్య శ్రీలంకతో భారత మహిళలు తలపడుతున్నారు. డంబుల్లా వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇప్పటివరకూ మహిళల ఆసియాకప్ టీ20 టోర్నీ ఎనిమిది సార్లు నిర్వహించగా.. భారత మహిళలు ఏడు సార్లు విజేతగా నిలిచారు. 2018లో బంగ్లా మహిళలు.. ఇండియాను ఓడించి ఒకసారి ట్రోఫీని ముద్దాడారు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఓటమెరుగని జట్టుగా అజేయంగా ఫైనల్ చేరిన హర్మన్ ప్రీత్ సేన.. ఇప్పుడు ఎనిమిదో టైటిల్‌పై కన్నేసింది.
తుది జట్లు
భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా ఛెత్రీ, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజ కన్వార్, రేణుకా ఠాకూర్.
శ్రీలంక: చమరి ఆటపట్టు (కెప్టెన్), విష్మి గుణరత్నె, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హారి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని (వికెట్ కీపర్), హాసిని పెరీరా, సుగందిక కుమారి, ప్రియదర్శిని, ఉదేషిక, సచిని నిసాంసల.