మారేడుకాయ, బిల్వదళం అంటే శివుడికి ఎంతో ఇష్టమని ఠక్కున చెప్పేస్తారు. అయితే మారేడు పండు, మారేడాకు ఒక్క పూజకే కాదు ఆరోగ్యంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మారేడు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. . .
మహాశివుడికి అత్యంత ఇష్టమైనది మారేడుదళం, మారేడుఫలం..దోసెడు నీళ్లు ఆ లింగంపై పోసి, రెండు మారేడుదళాలు సమర్పించినా చాలు..ఆ శివుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే ఈ బిల్వఫలం ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్య పరంగాను ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంది. మారేడు పండులోని ఔషధగుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఆయుర్వేదం ప్రకారం.. మారేడు చెట్టు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధాలుగా ఉపయోగపడతాయి. మారేడు చెట్టు కాయలు కూడా ఆరోగ్యం పరంగా అద్భుతంగా పనిచేస్తాయి. దీని లోపల ఉండే గుజ్జులాంటి పదార్థాన్ని వెలగ అని అంటారు.మారేడు పండు కన్నా, లేత కాయ ఎక్కువ గుణాలు కలిగి ఉంటుంది.
వేసవి కాలంలో వాతావరణమే కాదు.శరీర ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటాయి.అయితే మారేడు పండు గుజ్జుతో తయారు చేసిన రసం తీసుకుంటే శరీర వేడి దూరం అవుతుంది.వేసవి తాపాన్ని కూడా తగ్గించేస్తుంది.మలబద్ధకం సమస్యతో బాధ పడే వారు తరచూ మారేడు పండు తీసుకోవాలి.ఇలా చేస్తే అందులో ఉండే ఫైబర్ మాలబద్ధ సమస్యను దూరం చేయడంతో పాటు ఇతర జీర్ణ సమస్యలను కూడా తగ్గేలా చేస్తుంది. నులి పురుగులు కూడా నాశనం అవుతాయి.
ALSO READ: ఆరోజు తిరుమల, విజయవాడ ఆలయాలు బంద్ ... ఎప్పుడంటే..
ఈ మారేడు పండు కూడా కాయగా ఉన్నప్పుడు రుచిలో వగరుగా,పుల్లగా ఉంటుంది. కానీ, అదే పండు పూర్తిగా పండుగా మారినప్పుడు..తీపి పులుపుతో కూడిన రుచిలో ఉంటుంది. ఈ మారేడు పండు అతిసార వ్యాధికి మంచిది. మారేడుపండు రసంలో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్తసంబంధిత ఇన్ఫెక్షన్లు, ఇబ్బందులను నయం చేస్తుంది. మారేడు పండుతో మదుమేహం కంట్రోల్ అవుతుంది.
మారేడు పండు జ్యూస్‌తో అజీర్ణ సమస్యలు, మలబద్ధకం, గ్యాస్, పేగు పూత వంటి సమస్యలు నివారించుకోవచ్చు. కడుపు నొప్పి, నీరసం, నిస్సత్తువ ఇవన్నీ అమీబియాస్ వ్యాధి లక్షణాలు. ఇన్ని లక్షణాలు ఉన్న అమీబియాస్ ను మారేడు మూలాలతో సహా మాయం చేయగలదని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. హైపర్ టెన్షన్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ క్రమంగా కరుగుతుంది. గుండె జబ్బు సమస్యలతో బాధపడేవారికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
ఎండాకాలంలో మారేడు పండు రసాన్ని తాగితే చలువ చేస్తుంది. మారేడు పండులో గుజ్జును మిక్సిలో వేసి జ్యూస్ చేసుకుని ఇందులో కొద్దిగా నిమ్మరసం, నాలుగైదు పుదీనా ఆకులు, కావాల్సినంత పంచదార వేసుకొని తాగితే వేసవిలో ఉపశమనం కలుగుతుంది. శరీరానికి వెంటనే చలవ చేస్తుంది.
దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు నియంత్రిస్తుంది. మారేడు ఆకులు కొద్దిపాటి జ్వరాన్ని తగ్గిస్తాయి. బిల్వ ఆకుల కషాయము తీసి అవసరం మేరకు కొంచం తేనె కలిపి తాగితే జ్వరం త్వరగా తగ్గుతుంది. బిల్వ ఆకుల రసం తాగితే చాలు.... ఒంట్లో వేడి పోతుంది. మారేడుదళం ... గాలిని, నీటిని వడకట్టి కాలుష్యరహితము చేస్తుంది. అనేక వైరల్ ,ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.
మారేడు పండులో ప్రోటీన్స్, కాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి.అటువంటి మారేడు పండు మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు.అనేక జబ్బులను కూడా నివారిస్తాయి.మంచి సువాసన, రుచి కలిగి ఉండే మారేడు పండు గుజ్జును తరచూ తీసుకోవడం వల్ల కడుపులో అల్సర్ సమస్య దూరం అవుతుంది.