ఎంత నిజాయితీ:పేద కూలీలకు దొరికిన బంగారం నిధి..అధికారులకు అప్పగింత

వాళ్లందరూ నిరు పేదలు..పొట్టకూటి కోసం కూలీ పనులు చేసుకుంటున్నారు. అలాంటి కూలీలకు బంగారం నిధి దొరికింది. అవును..100 సంవత్సరాల నాటి బంగారం ఆభరణాలు దొరికాయి.. మరి ఆ కూలీలు ఏం చేశారు.. వాటిని ఇంటికి తీసుకెళ్లారా లేదా అనేది తెలుసుకుందాం.

కేరళలోని కన్నూర్‌లో పరిప్పై గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు.. గ్రామపంచాయతీ పరిధిలో ఓ నీటి గుంట తవ్వుతుండగా.. ఓ బాక్సులాంటి కంటైనర్ బయటపడింది. మొదట కూలీలు ఆ బాక్సును చూసి భయపడ్డారు. అందులో ఏదైన బాంబు ఉందేమోనని భయంతో పరుగులు పెట్టారు.  తర్వాత తేరుకొని బాక్సును  ఓపెన్ చేసి చూసి షాక్ కు గురయ్యారు. అందులో ఉన్న బంగారు, ముత్యాలు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. 

ALSO READ| 7 రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల్లో ఇండియాకూటమి హవా.. బీజేపీ ఘోర ఓటమి

పెట్టలో 17 ముత్యాల పూసలు, 13 బంగారు పతకాలు, సంప్రదాయ నెక్లెస్ (కషుమాల)లోని నాలుగు పతకాలు, ఐదు పురాతన ఉంగరాలు, చెవిపోగులు , అనేక వెండి నాణేలు ఉన్నాయి. వెంటనే కూలీలు వీటిని గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. పోలీసులకు అప్పగించారు. పోలీసులు దానిని తాలిపరంబ కోర్టులో హాజరుపరిచి పురావస్తు శాఖకు సమాచారం అందించారు. కూలీలో అయినా తమ నిజాయితీని చాటుకున్నారు ఉపాధి హామీ కూలీలు.