నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. రైతులు, ఉపాధి కూలీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సరైన వసతులు లేకపోవడంతో కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ లో ఉపాధి పనులకు వెళ్లడం లేదు కూలీలు. దీంతో గ్రామ సర్పంచ్, పంచాయతీ పాలకమండలి సమావేశమైంది. ఉపాధి పనులకు రప్పించేందుకు ఇళ్లకు వెళ్లి బొట్టుపెట్టి పిలవాలని నిర్ణయించింది. 3 రోజులుగా ప్రతీరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది.