వచ్చే రెండేళ్లలో భారత వృద్ధిరేటు 6.7 శాతం

వచ్చే రెండేళ్లలో భారత వృద్ధిరేటు 6.7 శాతం

వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలు (2025–26, 2026–27) భారత వృద్ధిరేటు 6.7 శాతంగా కొనసాగవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 2025లో దక్షిణాసియా వృద్ధిరేటు 6.2 శాతంగా ఉండవచ్చని పేర్కొన్నది. ఆ తర్వాత ఏడాది కూడా అదే స్థాయిని కొనసాగించవచ్చని అంచనా వేసింది. భారత్​లో సేవల రంగం స్థిరంగా వృద్ధి చెందవచ్చు. తయారీ కార్యకలాపాలు మరింత బలోపేతం కావొచ్చు. వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఇందుకు దోహదం చేయవచ్చు. 

    

  • ప్రభుత్వ పెట్టుబడులు మోస్తారుగా ఉన్నా  ప్రైవేటు పెట్టుబడులు రాణిస్తుండటంతో పెట్టుబడుల్లో వృద్ధి స్థిరంగా కనిపించవచ్చు. 
  •     
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 6.5 శాతానికి పరిమితం కావొచ్చు.  ఇందుకు పెట్టుబడుల్లో మందగమనం, బలహీన తయారీ కారణమని ప్రపంచ బ్యాంక్​ పేర్కొన్నది. ప్రైవేట్​ వినియోగంలో వృద్ధి బలంగా ఉండటం కలిసొచ్చే అంశమని పేర్కొన్నది. 
  •     
  • వ్యవసాయ రంగం రికవరీ చెందడంతో గ్రామీణ ఆదాయాలు మెరుగుపడి వినియోగం పెరిగిందని విశ్లేషించింది.
  •      
  • భారత్​ను మినహాయిస్తే దక్షిణాసియా ప్రాంత వృద్ధి 2024లో 3.9 శాతంగా ఉండవచ్చు. బంగ్లాదేశ్​లో రాజకీయ సంక్షోభం వల్ల పెట్టుబడిదార్ల విశ్వాసం దెబ్బతిన్నది. పాకిస్తాన్, శ్రీలంక పుంజుకోవడం సానుకూలంశం. 
  •     
  • భారత్​ను పరిగణనలోకి తీసుకుంటే దక్షిణాసియా వృద్ధి 2025లో 4 శాతం, 2026లో 4.3 శాతంగా నమోదు కావచ్చని అంచనా.
  •      
  • చైనా ఆర్థిక వ్యవస్థ 2024లో 5 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. అంతక్రితం ఏడాది వృద్ధి 5.2శాతంతో పోలిస్తే తక్కువే. అయినా ప్రభుత్వ అంచనాలకు తగ్గట్లుగా వెలువడింది. 
  •     
  •  గ్లోబల్​ ఎకానమీ 2025–26 రెండింటిలోనూ 2.7 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.